Page Loader
కమ్యూనిస్టులకు హ్యాండ్ ఇచ్చిన సీఎం కేసీఆర్.. రగిలిపోతున్న కామ్రెడ్లు
సీఎం కేసీఆర్ ప్యూహాత్మక వైఖరితో రగిలిపోతున్న కమ్యూనిస్టులు

కమ్యూనిస్టులకు హ్యాండ్ ఇచ్చిన సీఎం కేసీఆర్.. రగిలిపోతున్న కామ్రెడ్లు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 22, 2023
11:06 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ వ్యూహ్మాత్మక వైఖరిని పాటిస్తున్నారు.ఈ మేరకు ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు దూరంగా ఉంటున్నారు. సోమవారం ఏకంగా 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచారు.కేవలం 4 స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను ఖరారు చేయలేదు. మరోవైపు తమకు కేసీఆర్ తమను మోసం చేశారని కమ్యూనిస్టులు భావిస్తున్నారు. ఏకపక్షంగా టిక్కెట్లు కేటాయించడంపై లోలోపల రగిలిపోతున్నట్లు సమాచారం. మునుగోడు ఉపఎన్నికలో కమ్యూనిస్టుల మద్దతు కూడగట్టిన బీఆర్ఎస్, రానున్న ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంలతో కలిసే పోటీ చేయనున్నట్లు అంతా భావించారు. మరోవైపు కేసీఆర్ పెండింగ్ పెట్టిన నాలుగు స్థానాలు కమ్యూనిస్టులు కోరుకుంటున్న స్థానాలు కాకపోవడం గమనార్హం. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోదనే విషయంపై ఆయన స్పష్టతనిచ్చారు.

details

కమ్యూనిస్టులకు అపాయింట్‌మెంట్ ఇవ్వని కేసీఆర్

మునుగోడు ఉపఎన్నికలో బీఆర్ఎస్‌ అభ్యర్థికి సీపీఐ, సీపీఎంలు గట్టిగా మద్దతిచ్చాయి. కమ్యూనిస్టులకు మునుగోడులో మంచి ఓటు బ్యాంకే ఉండటంతో ఆ పార్టీల మద్దుతు లేకుండా బీజేపీ అభ్యర్థిని ఢీకొట్టడం కష్టమని కేసీఆర్ భావించారు. ఈ నేపథ్యంలోనే కమ్యూనిస్ట్ నేతలతో ప్రగతిభవన్‌ వేదికగా చర్చించిన కేసీఆర్‌, ఆ పార్టీ జాతీయ నేతలనూ మద్ధతివ్వాలని కోరారు.ఈ మేరకు జాతీయ రాజకీయాల్లోనూ సంయుక్తంగా ప‌నిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందే తమకు చెరో 5 స్థానాలు కేటాయించాలని సీపీఐ, సీపీఎం డిమాండ్ చేసినట్లు సమాచారం. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో చెరో సీటు ఇచ్చేందుకు కేసీఆర్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.దీనిపై చర్చలు జరిపేందుకు నెల నుంచి కేసీఆర్ అపాయింట్‌మెంట్ అడిగితే ఇవ్వలేదట.ఇప్పుడు ఏకపక్షంగా టిక్కెట్లు కేటాయించడంపై కామ్రేడ్లు రగిలిపోతున్నట్లు సమాచారం.