
Telangana: తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం
ఈ వార్తాకథనం ఏంటి
ఆరు గ్యారంటీల అమలులో భాగంగా తెలంగాణ సర్కార్ మరో ముందడుగు వేసింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇచ్చే ప్రణాళికలను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
లబ్ధిదారులకు నగదుతో పాటు తులం బంగారం కూడా ఇవ్వనున్నారు. ఈ క్రమంలో బీసీ,మైనారిటీ,గిరిజన సంక్షేమ శాఖలపై రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుపై లోతైన అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.
అలాగే, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించేందుకు స్థలాలు గుర్తించడంతో పాటు అంచనాలు తయారు చేయాలన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పలు శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
CM Revanth reddy : తులం బంగారం ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి..సీఎం రేవంత్ రెడ్డి https://t.co/zE07i66ztM #CMRevanthreddy
— Mic Tv (@Mictvdigital) January 27, 2024