Page Loader
Revanth Reddy: నేడు సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
నేడు సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: నేడు సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2024
09:22 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు (సోమవారం) ఢిల్లీ పయనమవుతున్నారు. ఉదయం ప్రెస్ మీట్ అనంతరం సాయంత్రం 4 గంటలకు ఆయన ఢిల్లీ వెళ్లే అవకాశముంది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా పాలన విజయగాథలపై ఆయన కాంగ్రెస్ హైకమాండ్‌తో సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి సంబంధించి పార్టీ నేతలను ఆహ్వానించే అవకాశం కూడా ఉంది. రాష్ట్రానికి సంబంధించి కీలక అంశాలపై హైకమాండ్‌తో చర్చించేందుకు సీఎం ఢిల్లీకి వెళ్తున్నట్లు తెలుస్తోంది.

వివరాలు 

రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక విషయాలపై చర్చ 

ఇందులో నామినేటెడ్ పోస్టుల భర్తీ, కుల గణన వంటి అంశాలతో పాటు, మంత్రివర్గ విస్తరణపై కూడా ఆయన చర్చించనున్నట్లు సమాచారం. ఈ నిర్ణయాలు నెల క్రితమే తీసుకోవాల్సి ఉండగా, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల కారణంగా వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో, రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక విషయాలపై చర్చించనున్నారు. అనంతరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుటుంబసభ్యులు నిర్వహించే ఒక ప్రత్యేక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని సమాచారం.