తదుపరి వార్తా కథనం

Revanth Reddy: మిస్ వరల్డ్ ఏర్పాట్లపై సీఎం సమీక్ష..అతిథులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసేలా అదేశాలు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Apr 29, 2025
03:42 pm
ఈ వార్తాకథనం ఏంటి
మిస్‌వరల్డ్ - 2025 పోటీల ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు.
ఈ సందర్భంగా ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి, ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై వివరాలు అడిగారు.
మే 10న పోటీలు ప్రారంభంకానున్న నేపథ్యంలో దేశ విదేశాల నుంచి రానున్న అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు.
విమానాశ్రయాలు, హోటళ్లు, చారిత్రక కట్టడాల వద్ద భద్రతా ఏర్పాట్లను బలపరిచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రాష్ట్రానికి వచ్చే అతిథులు పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు తగిన ఏర్పాట్లు ఉండాలన్నారు.
నగర సుందరీకరణ పనులను వేగవంతం చేయాలని, పోటీలకు ముందు అన్ని పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.