Cockroach Cafe: బొద్దింక పేరుతో కేఫ్.. లోపల మాత్రం ఇంద్రభవనం.. బీహార్ కేఫ్ స్టోరీ ఇది!
ఈ వార్తాకథనం ఏంటి
వ్యాపారంలో విజయం సాధించాలంటే నాణ్యమైన సేవలతో పాటు వినియోగదారుల దృష్టిని ఆకర్షించే ప్రత్యేకత కూడా అవసరం. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్న బిహార్‌కు చెందిన ఓ వ్యాపారి తన కొత్త కేఫ్‌కు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసేలా 'కాక్రోచ్ కేఫ్' (Cockroach Cafe) అని పేరు పెట్టాడు. నలంద జిల్లాలోని హిల్సా బైపాస్ రోడ్డులో ఇటీవల ప్రారంభమైన ఈ కేఫ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీస్తోంది. పేరే ప్రధాన ఆకర్షణగా మారడంతో నెటిజన్లు సరదా కామెంట్లతో పోస్టులు షేర్ చేస్తున్నారు. "ఇక మీ భోజనంలో బొద్దింక కనిపించినా ఫిర్యాదు చేసే అవకాశం ఉండదు" అంటూ హాస్యాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.
వివరాలు
పేరు వెనుక ఉన్న అసలు ఉద్దేశం
కేఫ్‌కు ఇలాంటి పేరు పెట్టడం వెనుక ఉద్దేశం పూర్తిగా ప్రచారమేనని యజమాని వెల్లడించారు.
ఎన్‌డీటీవీతో మాట్లాడిన ఆయన.. నేటి యువతకు కొత్తదనం, విభిన్న ఆలోచనలు ఎక్కువగా ఆకర్షిస్తాయని చెప్పారు.
సాధారణంగా 'రాయల్ కేఫ్','ఫ్యామిలీ కేఫ్' వంటి పేర్లు అనేకం కనిపిస్తాయని,కానీ 'కాక్‌రోచ్ కేఫ్' అనే పేరు మాత్రం అందరి దృష్టిని వెంటనే ఆకర్షిస్తుందని వివరించారు.
తమ కేఫ్ పేరు విని మొదట ప్రజలు ఆశ్చర్యపోవాలని,దాని గురించి మాట్లాడుకోవాలని,ఆ ఆసక్తితో లోపలికి వచ్చిన వారు నాణ్యత,సేవలు చూసి మళ్లీ రావాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు.
పేరు ఎంత విభిన్నంగా ఉన్నా పరిశుభ్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.
ఈ పేరును కేవలం ఒక వినూత్న బ్రాండింగ్ వ్యూహంగా మాత్రమే చూడాలని పేర్కొన్నారు.
వివరాలు
లోపల అడుగుపెడితే మరో ప్రపంచమే
సోషల్ మీడియా కాలంలో భారీగా ప్రకటనలపై ఖర్చు చేయకుండానే ఇలాంటి ప్రత్యేకమైన పేరు ద్వారా సహజంగానే విస్తృత ప్రచారం లభిస్తుందని అభిప్రాయపడ్డారు.
'బొద్దింక కేఫ్' అనే పేరు విన్న వెంటనే చాలా మంది అపరిశుభ్రమైన ప్రదేశమని భావించే అవకాశం ఉంది.
కానీ వాస్తవ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన ఈ కేఫ్ ఇంటీరియర్ సందర్శకులను ఆకట్టుకుంటోంది.
నలుపు రంగు థీమ్‌తో రూపొందించిన డిజైన్, తగరపు పైకప్పు నుంచి వేలాడే పసుపు రంగు లైట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
గోడలను కృత్రిమ పూల తీగలతో అలంకరించగా, నలుపు రంగు సోఫాలు, ఎరుపు కుషన్లు, గ్లాస్ టేబుళ్లతో కస్టమర్లకు సౌకర్యవంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేశారు.
వివరాలు
పేరుపై భిన్నాభిప్రాయాలు
ముఖ్యంగా సాయంత్రం సమయంలో యువత ఇక్కడికి చేరుకుని టీ, స్నాక్స్ ఆస్వాదిస్తూ సెల్ఫీలు, సోషల్ మీడియా రీల్స్ రూపొందిస్తూ సందడి చేస్తున్నారు.
ఈ కేఫ్ పేరుపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు దీనిని సాహసోపేతమైన, తెలివైన మార్కెటింగ్ ఆలోచనగా ప్రశంసిస్తుండగా, మరికొందరు సరదాగా సెటైర్లు వేస్తున్నారు.
స్థానిక యువకుడు రాకేశ్ మాట్లాడుతూ.. మొదట ఈ పేరు చూసినప్పుడు ఎవరైనా సరదాగా బోర్డు పెట్టారని అనుకున్నానని, కానీ లోపలికి వెళ్లిన తర్వాత పూర్తిగా ఆశ్చర్యపోయానని తెలిపాడు.
కేఫ్ ఎంతో శుభ్రంగా ఉండటంతో పాటు సెల్ఫీలు దిగేందుకు కూడా అద్భుతమైన వాతావరణం ఉందని చెప్పాడు.
మరోవైపు, కొంతమంది పెద్దవారు ఈ పేరును విమర్శిస్తున్నప్పటికీ, యువత మాత్రం ఈ వినూత్న బ్రాండింగ్‌ను అభినందిస్తోంది.
వివరాలు
మూడు రోజుల్లోనే భారీ ప్రచారం
ప్రస్తుతం ఈ కేఫ్‌లో టీ, కాఫీ, మ్యాగీ, శాండ్‌విచ్‌లు, శీతల పానీయాలు వంటి ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయి.
ప్రారంభమై కేవలం మూడు రోజులు మాత్రమే అయినప్పటికీ, విచిత్రమైన పేరే దీనికి భారీ ప్రచారాన్ని తీసుకొచ్చింది.
వ్యాపారంలో ప్రత్యేకమైన గుర్తింపును సృష్టించగలిగితే అది విజయానికి బలమైన పునాది అవుతుందని బీహార్‌లోని ఈ 'బొద్దింక కేఫ్' మరోసారి నిరూపిస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కేఫ్‌కు 'బొద్దింక' పేరు
बिहार में शुरू हुआ कॉकरोच कैफे, लोग बोले- 'अब खाने में कीड़ा निकल जाए तो शिकायत भी नहीं कर सकते'#CockroachCafe #Bihar https://t.co/0POl6zxG4y
— NDTV India (@ndtvindia) July 31, 2026