LOADING...
Commercial LPG Shortage: వాణిజ్య సిలిండర్ల కొరత: చెన్నై హోటల్‌ బిల్లులో 'గ్యాస్ ఛార్జ్'… నెట్టింట వైరల్
వాణిజ్య సిలిండర్ల కొరత: చెన్నై హోటల్‌ బిల్లులో 'గ్యాస్ ఛార్జ్'… నెట్టింట వైరల్

Commercial LPG Shortage: వాణిజ్య సిలిండర్ల కొరత: చెన్నై హోటల్‌ బిల్లులో 'గ్యాస్ ఛార్జ్'… నెట్టింట వైరల్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 13, 2026
12:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల కొరత దేశవ్యాప్తంగా హోటల్‌ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అనేక ప్రాంతాల్లో హోటళ్లు,తినుబండారాల దుకాణాలు తాత్కాలికంగా మూతపడగా.. మరికొన్ని చోట్ల మాత్రం ధరలను పెంచి వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నైలోని ఒక హోటల్‌కు సంబంధించిన బిల్లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా ఇడ్లీ, వడ వంటి వంటకాల ధరలు మాత్రమే ఉండే బిల్లులో ఈసారి గ్యాస్‌ ఖర్చును కూడా ప్రత్యేకంగా చేర్చడం అందరి దృష్టిని ఆకర్షించింది. గ్యాస్‌ సిలిండర్ల కొరత కారణంగా వ్యయాలు పెరిగాయని, అందువల్ల ధరలను పెంచాల్సి వచ్చిందని హోటల్‌ యజమానులు చెబుతున్నారు. వినియోగదారులు ఈ పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించాలని కోరుతూ పలు హోటళ్లలో ప్రత్యేక బోర్డులు కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గ్యాస్ కొరతతో హోటళ్ల ఇబ్బందులు… బిల్లులో కొత్తగా 'గ్యాస్ ఛార్జ్'

Advertisement