Page Loader
Congress: అంబేద్కర్‌ను అమిత్ షా అవమానించినందుకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్‌ డిమాండ్..
అంబేద్కర్‌ను అమిత్ షా అవమానించినందుకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్‌ డిమాండ్..

Congress: అంబేద్కర్‌ను అమిత్ షా అవమానించినందుకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్‌ డిమాండ్..

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 18, 2024
10:14 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత రాజ్యాంగం రూపొందించిన డాక్టర్ బీఆర్. అంబేద్కర్‌ను అవమానించినందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. భారత రాజ్యాంగం ఆమోదం పొందిన 75 సంవత్సరాల సందర్భంగా, పార్లమెంట్‌లో రెండు రోజుల పాటు భారత రాజ్యాంగంపై చర్చ జరిగింది. ఈ చర్చలో, మంగళవారం నాడు, కేంద్ర హోంశమంత్రి అమిత్‌షా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ లబ్ధి కోసం బీఆర్. అంబేద్కర్ పేరును వాడుకుంటున్నారని, అంబేద్కర్ పేరును జపించడం ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిందని ఆయన అన్నారు. అంబేద్కర్ పేరుకు బదులుగా దేవుడి పేరు చెప్పుకుంటే కొంత పుణ్యం కలుగుతుందని, అలా చేస్తే స్వర్గానికి వెళ్ళవచ్చని అమిత్‌షా హస్తం పార్టీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

వివరాలు 

రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు నోటీసు

అయితే, అమిత్‌షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గేలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా, "మనుస్మృతి ను విశ్వసించే వారు అంబేద్కర్‌తో విభేదిస్తారు" అని రాసుకొచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్‌ను అవమానించినందుకు బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ జెండాకు వ్యతిరేకంగా ఉన్నారని పేర్కొన్నారు. మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ,బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ పూర్వీకులు కూడా అశోక్ చక్రాన్ని వ్యతిరేకించారని, సాంఘిక సమరసతకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. అంబేద్కర్ దేవుడి కంటే తక్కువరేమీ కాదని, ఆయన దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు, పేదల కోసం అండగా నిలిచిన వ్యక్తి అని చెప్పారు. అంబేద్కర్‌ను అవమానించిన కేంద్ర హోంశంత్రికి తక్షణమే క్షమాపణలు చెప్పాలని రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు నోటీసు ఇచ్చారు.