LOADING...
Udhayanidhi: కాంగ్రెస్ మమ్మల్ని మోసం చేసింది.. ఇక ఎప్పటికీ నమ్మొద్దు: ఉదయనిధి స్టాలిన్
కాంగ్రెస్ మమ్మల్ని మోసం చేసింది.. ఇక ఎప్పటికీ నమ్మొద్దు: ఉదయనిధి స్టాలిన్

Udhayanidhi: కాంగ్రెస్ మమ్మల్ని మోసం చేసింది.. ఇక ఎప్పటికీ నమ్మొద్దు: ఉదయనిధి స్టాలిన్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 24, 2026
01:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉదయనిధి స్టాలిన్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ తమను వెన్నుపోటు పొడిచిందని ఆయన ఆరోపించారు. రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ డీఎంకేపైనే ఆధారపడి రాజకీయంగా ముందుకు సాగిందని, కానీ ఇప్పుడు అధికారం కోసం టీవీకేతో చేతులు కలిపిందని మండిపడ్డారు. ఈవిషయాన్ని కార్యకర్తలు ఎప్పటికీ మర్చిపోవద్దని సూచించిన ఆయన.. భవిష్యత్తులో కాంగ్రెస్ నేతలను తమ దరిదాపుల్లోకి కూడా రానివ్వకూడదని పిలుపునిచ్చారు. రాజకీయంగా తన ఉనికిని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఎంతటి దారుణమైన నిర్ణయానికైనా వెనుకాడదని మరోసారి స్పష్టమైందని ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా భాజపా వరుస విజయాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యూహాలే కారణమని తాను ఇంతకాలం భావించానని ఆయన అన్నారు.

వివరాలు

డీఎంకే కార్యకర్తలు కష్టపడి పనిచేయడం వల్లే కాంగ్రెస్ కు ఐదు స్థానాలు

అయితే ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ నేతల అసమర్థతే ప్రజలను బీజేపీ వైపు మళ్లిస్తోందని స్పష్టంగా అర్థమవుతోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి గతంలో రాజ్యసభ సభ్యత్వాలు, అసెంబ్లీ స్థానాలు దక్కడం డీఎంకేతో ఉన్న పొత్తు వల్లేనని ఉదయనిధి అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా డీఎంకే కార్యకర్తలు కష్టపడి పనిచేయడం వల్లే కాంగ్రెస్ ఐదు స్థానాలు గెలుచుకుందని పేర్కొన్నారు. కానీ ఆ విశ్వాసాన్ని నిలబెట్టకుండా, గెలిచిన వెంటనే అధికారం కోసం కాంగ్రెస్ నేతలు పరుగులు తీశారని ఆయన విమర్శించారు. త్వరలోనే తమిళనాడు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని ఉదయనిధి స్టాలిన్ హెచ్చరించారు. ఇదేసమయంలో ఎన్నికల్లో డీఎంకే పరాజయం నేపథ్యంలో పార్టీ అంతర్గత వ్యూహాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని కార్యకర్తలకు సూచించారు.

Advertisement