అస్వస్థతో ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆమెను.. దిల్లీలోని గంగారామ్ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ అరూప్ బసు బృందం సోనియా గాంధీకి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో చేరే సమయంలో సోనియాగాంధీ వెంట ఆమె కుమార్తె ప్రియాంక వాద్రా ఉన్నారు. సోనియా ఆరోగ్య పరిస్థితిపై సర్ గంగారామ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. డాక్టర్ అరూప్ బసు బృందం సోనియా గాంధీకి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఆస్పత్రిలోని ఛాతి విభాగంలో ఆమెను జాయిన్ అయినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అమె వైద్యుల అబ్జర్వేషన్‌లో ఉన్నట్లు చెప్పారు.
ఆందోళనలో కాంగ్రెస్ శ్రేణులు
సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరడంపై కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆమె త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు. దిల్లీలో రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జూడో యాత్రలో ప్రియాంక వాద్రా, రాబర్ట్ వాద్రాతో కలిసి సోనియా గాంధీ పాల్గొన్నారు. సోనియా గాంధీ ఇప్పటికే రెండు సార్లు కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలో ఆమె పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. ఇది వరకు కూడా సోనియాకు ముక్కు నుంచి రక్తస్రావం కావడం వల్ల ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం ఛాతిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ కోసం చికిత్స తీసుకున్నారు.