Page Loader
Congress: నేడు కొలువుదీరనున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. సీఎంగా రేవంత్ రెడ్డి! 
Congress: నేడు కొలువుదీరనున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. సీఎంగా రేవంత్ రెడ్డి!

Congress: నేడు కొలువుదీరనున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. సీఎంగా రేవంత్ రెడ్డి! 

వ్రాసిన వారు Stalin
Dec 04, 2023
09:29 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సోమవారం కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ మేరకు కాంగ్రెస్‌ బృందం ఆదివారం రాత్రి గవర్నర్‌ తమిళిసైని కలిశారు. తమకు మెజార్జీ వచ్చినందని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. ఇదే సయమంలో సోమవారం జరిగే కాంగ్రెస్‌ సీఎల్పీ మీటింగ్‌లో ముఖ్యమంత్రి ఎవరన్నది తేలనుంది. అనంతరం సీఎం అభ్యర్థి ఎంపికను కాంగ్రెస్ పార్టీ గవర్నర్‌కు తెలియజేస్తుంది. అయితే కాంగ్రెస్ సీఎంగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రమాణం చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అధిష్టానం ఆయన పేరును దాదాపు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. సీఎం రేసులో మరో కీలక నేత భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. ఈయన కూడా సీఎం కావొచ్చనే ప్రచారం జరుగుతోంది.

సీఎం

ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతను డీకే శివకుమార్‌‌కు అప్పగించిన అధిష్ఠానం

సీఎల్పీ భేటీలో సీఎంను ఎన్నుకుంటారు. ఆ వెంటనే ప్రమాణం స్వీకారం ఉంటుందని కాంగ్రెస్ ప్రకటించింది. అనంతరం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల పరిశీలకురాలు దీపాదాస్‌మున్షీ, ఇన్‌ఛార్జి ఠాక్రే శనివారం రాత్రి నుంచి హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతను కూడా డీకే శివకుమార్‌‌కు అధిష్ఠానం అప్పగించినట్లు తెలుస్తోంది. ఉదయం 9:30 గంటల తర్వాత సీఎల్పీ మీటింగ్‌లో ఎంపిక చేసిన పేరును అధిష్ఠానానికి పంపిస్తారు. అనంతరం గవర్నర్‌ను కలిసి సీఎల్పీ తీర్మానాన్ని అందజేస్తారు. వెంటనే సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని సమాచారం.