Page Loader
కర్ణాటక ఎన్నికల్లో ఆధిక్యంపై ​​కాంగ్రెస్ 'అన్‌స్టాపబుల్' ట్వీట్ 
కర్ణాటక ఎన్నికల్లో ఆధిక్యంపై ​​కాంగ్రెస్ 'అన్‌స్టాపబుల్' ట్వీట్

కర్ణాటక ఎన్నికల్లో ఆధిక్యంపై ​​కాంగ్రెస్ 'అన్‌స్టాపబుల్' ట్వీట్ 

వ్రాసిన వారు Stalin
May 13, 2023
11:26 am

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్(113స్థానాలు)కు మించి 117స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఫలితాల్లో కాంగ్రెస్ సత్తా చాటుతుండంతో ఆ పార్టీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి అసక్తికర ట్వీట్ చేసింది. సియా పాట 'అన్‌స్టాపబుల్'తో కూడిన రాహుల్ గాంధీని వీడియోను కాంగ్రెస్ ట్వీట్ చేసింది. రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర'లో నడుస్తున్న వీడియో అందులో కనపడుతుంది. 'నేను అజేయుడిని, నేను చాలా నమ్మకంగా ఉన్నాను. అవును, ఈ రోజు నన్ను ఆపలేరు' అనే వ్యాఖ్యలను కాంగ్రెస్ తన ట్వీట్‌కు జోడించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కాంగ్రెస్ పార్టీ చేసిన ట్వీట్