Page Loader
తెలంగాణ కాంగ్రెస్ మరో కీలక హామీ.. అధికారంలోకి వస్తే వెంటనే జనగణన చేస్తామన్న రాహుల్‌ గాంధీEmbed
అధికారంలోకి వస్తే వెంటనే జనగణన చేస్తామన్న రాహుల్‌ గాంధీ

తెలంగాణ కాంగ్రెస్ మరో కీలక హామీ.. అధికారంలోకి వస్తే వెంటనే జనగణన చేస్తామన్న రాహుల్‌ గాంధీEmbed

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 19, 2023
06:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ప్రజలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీల జల్లు కురిపించారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే, అధికారంలోకి రాగానే కులాల వారీగా జనగణన చేస్తామని ప్రకటించారు. దేశం సంపదలో పేదలకూ వాటా ఇస్తామని, దేశవ్యాప్తంగా కేవలం 5 శాతనికే ఓబీసీ అధికారులు పరిమితమయ్యారన్నారు. ఇంత తక్కువ స్థాయిలో వెనుకబడిన తరగతులకు చెందిన అధికారులుంటే ఆయా వర్గాలకు న్యాయం ఎలా దక్కుతుందన్నారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్ ప్రదేశ్‌, కర్ణాటకలో కుల జన గణన చేయాలని తమ ప్రభుత్వాలకు అదేశాలిచ్చామని రాహుల్ గుర్తు చేశారు. రాజ్యాధికారం తెలంగాణ ప్రజలే చేపట్టాలని ఆశించామని, కానీ కేసీఆర్‌ ప్రజలకు దూరమవుతూ వస్తున్నారన్నారు. అధికారమంతా ఒక్క ఫ్యామిలీకే దక్కిందని, దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం తెలంగాణలోనే ఉందన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అధికారంలోకి రాగానే జనగణన: రాహుల్