
Tirupati: తిరుపతిలో ఇంట్రా మోడల్ బస్ టెర్మినల్ నిర్మాణానికి శ్రీకారం.. శ్రీవారి ఆలయ శైలిలో డిజైన్
ఈ వార్తాకథనం ఏంటి
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే లక్షలాది భక్తుల సౌలభ్యార్థం తిరుపతిలోని ప్రస్తుత బస్టాండ్ స్థానంలో ఆధునిక ఇంట్రా మోడల్ బస్ టెర్మినల్‌ను నిర్మించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ప్రాజెక్ట్ కోసం రూ.500 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
బస్టాండ్‌తో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు, డార్మెటరీలు తదితర వసతులు కలిగిన ఈ టెర్మినల్ భవనం మొత్తం 10 అంతస్తులుగా ఉంటుందని తెలిపారు.
Details
ప్రాజెక్ట్ వివరాలు
భవన నిర్మాణం
ప్రస్తుత బస్టాండ్ ఉన్న 13.18 ఎకరాల్లో 12.19 ఎకరాల విస్తీర్ణంలో ఈ టెర్మినల్ నిర్మాణం జరగనుంది.
రోడ్లు
నూతన టెర్మినల్‌కు నాలుగు వైపులా రోడ్లు ఉండేలా డిజైన్ చేశారు.
పార్కింగ్ సౌకర్యం
సెల్లార్‌లో రెండు అంతస్తులు బైక్‌లు, కార్ల పార్కింగ్‌కు కేటాయించనున్నారు.
బస్టాండ్ ఏర్పాట్లు
గ్రౌండ్ ఫ్లోర్‌లో 98 ప్లాట్‌ఫామ్స్‌తో కూడిన భారీ బస్టాండ్, అదనంగా 50 బస్సుల పార్కింగ్, విద్యుత్ బస్సులకు ఛార్జింగ్ సదుపాయం ఏర్పాటు చేయనున్నారు.
Details
వాణిజ్య, కార్యాలయ వాడకం
మొదటి, రెండో అంతస్తుల్లో RTC కార్యాలయాలు, ఫుడ్‌కోర్టులు, దుకాణాలు ఉంటాయి.
మూడో అంతస్తు సర్వీసుల కోసం, నాలుగవ నుంచి ఏడవ అంతస్తు వరకు హోటళ్లు, రెస్టారెంట్లు, డార్మెటరీలు ఏర్పాటవుతాయి.
ఎనిమిదవ నుంచి పదవ అంతస్తు వరకు బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు ఉంటాయి.
హెలిప్యాడ్
పదవ అంతస్తుపై హెలిప్యాడ్‌ను నిర్మించనున్నారు.
మొత్తం నిర్మాణ విస్తీర్ణం
1.54 లక్షల చదరపు అడుగుల బిల్ట్‌అప్ ప్రాంతంగా ప్రణాళిక.
Details
నిధుల భాగస్వామ్యం
RTC తన స్థలాన్ని కేటాయిస్తుండగా, NHML (నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్) కొంత నిధులు సమకూర్చనుంది.
ప్రైవేటు గుత్తేదారు సంస్థ ద్వారా మిగిలిన నిధులు వస్తాయి. నిర్మాణం పూర్తయ్యాక వాణిజ్య ప్రదేశాల ద్వారా వచ్చే ఆదాయాన్ని RTC, NHML, గుత్తేదారు సంస్థలు వాటా పంచుకుంటాయి.
తాత్కాలిక ఏర్పాట్లు
బస్ టెర్మినల్ నిర్మాణ సమయంలో ప్రస్తుత బస్టాండ్‌ను మంగళం డిపో, అలిపిరి సమీపంలో ఉన్న తితిదే స్థలంలో, తిరుచానూరు మార్గంలోని కొన్ని ప్రాంతాల్లో తాత్కాలికంగా మార్చనున్నారు.
Details
తిరుమల శైలిని ప్రతిబింబించే డిజైన్
ఈ టెర్మినల్ డిజైన్ రూపొందించే బాధ్యత రైట్స్ సంస్థకు అప్పగించారు. ముఖద్వారం తిరుమల ఆలయ శైలిని తలపించేలా రూపొందించారు.
రైల్వేస్టేషన్ నుంచి నేరుగా టెర్మినల్‌కు చేరుకునేలా 1 కి.మీ. స్కైవాక్ నిర్మాణ ప్రతిపాదన కూడా ఉంది.
ఈ ప్రాజెక్టు పూర్తయితే భక్తులకు తిరుపతిలో ఒకే చోట అన్ని వసతులు లభించేలా మారుతుంది.