LOADING...
Jurala Project: జూరాలకు కొనసాగుతున్న  భారీ వరద.. 12 గేట్లు ఎత్తివేత
జూరాలకు కొనసాగుతున్న భారీ వరద.. 12 గేట్లు ఎత్తివేత

Jurala Project: జూరాలకు కొనసాగుతున్న  భారీ వరద.. 12 గేట్లు ఎత్తివేత

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 26, 2025
09:08 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎగువ కృష్ణా లోయ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. బుధవారం నాటికి జలాశయానికి 95,119 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. ఈ ప్రవాహాన్ని నియంత్రించేందుకు జలవనరుల శాఖ అధికారులు జూరాల డ్యామ్‌కు సంబంధించిన 12 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. మొత్తం విడుదలైన 96,172 క్యూసెక్కులలో, 63,696 క్యూసెక్కులు స్పిల్‌వే గేట్ల ద్వారా విడుదల చేయగా, మిగిలిన 30,422 క్యూసెక్కులు విద్యుత్ ఉత్పత్తి కోసం ఉపయోగించారు. జూరాల ప్రాజెక్టు గరిష్ఠ నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం అందులో 8.010 టీఎంసీల నీరు నిల్వగా ఉంది.

వివరాలు 

జూరాల డ్యామ్‌ నుంచి వరదనీరు శ్రీశైలానికి..

ఇక ఈ వరద ప్రభావం శ్రీశైలం జలాశయం మీద కూడా స్పష్టంగా కనిపిస్తోంది. జూరాల డ్యామ్‌ నుంచి సుమారు 1.02 లక్షల క్యూసెక్కుల వరదనీరు శ్రీశైలానికి చేరుతోంది. శ్రీశైల డ్యామ్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 861.70 అడుగుల వద్దకి చేరింది. అంతేగాక, ఈ ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా, ప్రస్తుతం అందులో 111.40 టీఎంసీల నీరు నిల్వగా ఉంది.