తదుపరి వార్తా కథనం

దేశంలో కొత్తగా 5,357 మందికి కరోనా; పాజిటివిటీ రేటు 3.39%
వ్రాసిన వారు
Stalin
Apr 09, 2023
11:23 am
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో గత 24 గంటల్లో 5,357 కొత్త కోవిడ్ కేసులు నమోదైనట్లు ఆదివారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 32,814కి చేరుకుంది.
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు మొత్తం 220.66 కోట్ల డోసులు అందించినట్లు కేంద్రం పేర్కొంది.
కొత్తగా 3,726మంగది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్త రికవరీల సంఖ్య 4,41,92,837కి పెరిగింది. రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది.
యూపీలో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆసుపత్రులలో మాస్క్‌లను తప్పనిసరి చేసింది. ఆస్పత్రుల్లో అన్నిరకాలైన వైద్య పరికరాలు, మందులు అందుబాటులో ఉండాలని యూపీ ఉప ముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్ ఆదేశించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
దేశంలో నిన్నటితో పోలిస్తే తగ్గిన కరోనా కేసులు
India Records 5,357 Covid Cases In 24 Hours https://t.co/89vyA1gr6Q pic.twitter.com/HssHwrJmiA
— NDTV News feed (@ndtvfeed) April 9, 2023
మీరు పూర్తి చేశారు