
దేశంలో కొత్తగా 535మందికి కరోనా; 6,168కి తగ్గిన యాక్టివ్ కేసులు
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలోని గత 24గంటల్లో 535 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా కేసులతో కలిపి యాక్టివ్ కేసులు 6,168కి తగ్గినట్లు కేంద్రం వెల్లడించింది.
కరోనాతో కొత్తగా ఐదుగురు మరణించినట్లు కేంద్రం చెప్పింది. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,31,854కు పెరిగింది.
దేశంలో ప్రస్తుతం మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.49 కోట్లు(4,49,88,426)కు పెరిగినట్లు కేంద్రం పేర్కొంది.
క్రియాశీల కేసులు ఇప్పుడు మొత్తం ఇన్‌ఫెక్షన్లలో 0.01 శాతం ఉన్నాయి. అయితే జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 98.80 శాతంగా నమోదైంది. కరోనా నుంచి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4,44,50,404 కు పెరిగింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కరోనాతో కొత్తగా ఐదుగురు మృతి
India records 535 new COVID-19 infections, count of active cases now stands at 6,168. Death toll increases to 5,31,854, tally of infections 4,49,88,426: Union Health Ministry
— Press Trust of India (@PTI_News) May 25, 2023