LOADING...
Coronavirus: వైజాగ్‌లో కరోనా కలవరం.. అధికారుల అలర్ట్ 
Coronavirus: వైజాగ్‌లో కరోనా కలవరం.. అధికారుల అలర్ట్

Coronavirus: వైజాగ్‌లో కరోనా కలవరం.. అధికారుల అలర్ట్ 

వ్రాసిన వారు Stalin
Jan 02, 2024
01:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

విశాఖపట్నంలో కరోనా వైరస్ కలకలం మళ్లీ మొదలైంది. కొన్ని రోజులుగా కరోనా కేసులు వైజాగ్‌లో పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో విశాఖలో అత్యధికంగా 10 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. దీంతో నగర వాసుల్లో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం వైజాగ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 38కి చేరింది. వీరిలో దాదాపు 25 మంది ఆస్పత్రుల్లో.. మిగతా వారు హోమ్ ఐసోలేషన్ ఉన్నారు. డిసెంబర్ రెండో వారం నుంచి విశాఖలో కరోనా కేసులు వెలుగుచూడటం ప్రారంభమయ్యాయి. కరోనా కేసుల పెరుగుదలతో.. అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలో టెస్టులు సంఖ్యను భారీగా పెంచారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైజాగ్‌లో ఒక్కరోజే 10 కేసులు నమోదు