Covid-19 : కేరళలో కొత్తగా 265 కొవిడ్ కేసులు.. 80శాతం యాక్టివ్ కేసులు ఇక్కడే
ఈ వార్తాకథనం ఏంటి
కేరళలో కొత్తగా 265 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో దాదాపుగా 80శాతానికిపైగా మలయాళ ప్రదేశాల్లోనే ఉండటం గమనార్హం.
గురువారం ఉదయం నుంచి 24 గంటల వ్యవధిలో 265 తాజా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అలాగే, ఒక వ్యక్తి కోవిడ్ 19 తో మరణించారు.
గత మూడేళ్లలో కేరళ రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ సంబంధిత మరణాలు 72,060గా రికార్డయ్యాయి. ఇప్పటివరకు మొత్తం రికవరీల సంఖ్య 68,37,689 కి పెరిగింది.
అంతకుముందు, 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 300 కొత్త కొవిడ్ కేసులు, మూడు మరణాలు సంభవించాయి.
కేసుల పెరుగుదల నేపథ్యంలో కేరళ ఆరోగ్య మంత్రి వీణాజార్జి వైద్య శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.
details
కొవిడ్ ప్రొటోకాల్ అమలు చేయాలి : ఆరోగ్యశాఖ మంత్రి
మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో అలెర్టుగా ఉండాలని, కొవిడ్ ప్రొటోకాల్ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
తిరువనంతపురం, ఎర్నాకులం జిల్లాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్న కారణంగా ప్రధానంగా ఇక్కడ దృష్టి కేంద్రీకరించాలన్నారు.
24 గంటల్లో 640 కొత్త కేసులు :
భారతదేశంలో శుక్రవారం 640 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 2,669 నుండి 2,997 కి పెరిగింది.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కొవిడ్ బారిన పడినవారి సంఖ్య 4.50 కోట్లకుపైగా ఉంది. మరణించిన వారి సంఖ్య 5,33,328కి చేరింది.
ఇక రికవరీల సంఖ్య 4,44,70,887కి పెరిగగా, జాతీయ రికవరీ రేటు ప్రస్తుతం 98.81 శాతంగా ఉంది. మరణాల రేటు 1.19శాతం వద్ద కొనసాగుతోంది.220.67 కోట్ల డోస్‌ల కొవిడ్ వ్యాక్సిన్‌ను అందించించారు.