Ravindra Jadeja: బీజేపీలో చేరిన క్రికెటర్ రవీంద్ర జడేజా
టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన జీవన ప్రస్థానంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఆయన రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఆయన భార్య రివాబా జడేజా సోషల్ మీడియాలో పంచుకున్నారు. బీజేపీ ఇటీవల నిర్వహించిన సభ్యత్వ డ్రైవ్‌లో భాగంగా, జడేజా పార్టీ సభ్యత్వం పొందారు. అయితే, రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా 2019 నుంచి బీజేపీలోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆమె గుజరాత్‌లోని నార్త్ జామ్‌నగర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. గతంలో కూడా జడేజా తన భార్యకు మద్దతుగా రోడ్‌షోల్లో పాల్గొని ప్రచారం చేశారు, కానీ ఇప్పుడు ఆయన అధికారికంగా పార్టీకి చేరారు.
టీ20 ఫార్మాట్ నుండి తప్పుకున్న జడేజా
క్రికెటర్ గా రవీంద్ర జడేజా 72 టెస్టుల్లో 3,036 పరుగులు చేసి, 294 వికెట్లు పడగొట్టారు. వన్డేల్లో 197 మ్యాచ్‌లు ఆడిఉ 2,756 పరుగులు, 220 వికెట్లు సాధించారు. టీ20ల్లో 74 మ్యాచ్‌లలో 515 పరుగులు, 54 వికెట్లు తీశారు. టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత, జడేజా ఈ ఫార్మాట్ నుంచి తప్పుకున్నారు.