తదుపరి వార్తా కథనం

ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ ఇంట్లో కాల్చుకుని సీఆర్పీఎఫ్ జవాన్ ఆత్మహత్య
వ్రాసిన వారు
Stalin
Feb 04, 2023
12:31 pm
ఈ వార్తాకథనం ఏంటి
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) అసిస్టెంట్ సబ్ దిల్లీలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) డైరెక్టర్ నివాసంలో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
దిల్లీలోని తుగ్లక్ రోడ్ ప్రాంతంలోని ఉన్న ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ నివాసంలో ఈ ఘటన జరిగింది.
53ఏళ్ల సీఆర్పీఎఫ్ జవాన్ రాజ్‌బీర్ కుమార్ సర్వీస్ రైఫిల్ ఏకే-47తో తనపై రెండు రౌండ్లు కాల్చుకున్నట్లు అధికారులు చెప్పారు.
జవాన్
సంఘటనా స్థలంలో లభ్యంకాని సూసైడ్ నోట్
గత కొన్ని రోజులుగా సీఆర్పీఎఫ్ జవాన్ రాజ్‌బీర్ కుమార్ సెలవులో ఉన్నారు. శుక్రవారం తిరిగి చేరారు. అదే రోజు సాయంత్రం తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
అయితే సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని అధికారులు చెప్పారు. బాధితుడి కుటంబ సభ్యులకు సమాచారం అదించినట్లు వెల్లడించారు. సీఆర్పీసీ సెక్షన్ 174 కింద విచారణ ప్రారంభించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.