Page Loader
సర్జికల్ స్ట్రైక్స్: 'జవాన్లపై నమ్మకం ఉంది, కానీ బీజేపీని విశ్వసించలేం'
జవాన్లపై నమ్మకం ఉంది, బీజేపీని విశ్వసించలేము: కాంగ్రెస్ నేత రషీద్

సర్జికల్ స్ట్రైక్స్: 'జవాన్లపై నమ్మకం ఉంది, కానీ బీజేపీని విశ్వసించలేం'

వ్రాసిన వారు Stalin
Jan 27, 2023
02:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

2016లో భారత దళాలు జరిపిన సర్జికల్ దాడులకు ఎలాంటి రుజువు లేదని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ సింగ్‌‌కు మరో హస్తం పార్టీ నాయకుడు రషీద్ అల్వీ మద్దుతుగా నిలిచారు. సర్జికల్ స్ట్రైక్ వీడియోను విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం తన వద్ద సర్జికల్ స్ట్రైక్ వీడియో ఉందని చెబుతోంది కాబట్టి దానిని చూపించాలని ప్రభుత్వాన్ని దిగ్విజయ కోరడంలో తప్పేముందని రషీద్ ప్రశ్నించారు. 'సర్జికల్ స్ట్రైక్'‌పై దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలతో తాము ఏకీభవించడం లేదని, దాడులకు సంబంధించి భారత సైనికులు ఎలాంటి రుజువు చూపించాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ చెప్పిన మూడు రోజులకే మరో సీనియర్ నేత అందుకు విరుద్ధంగా స్పందించడం గమనార్హం.

కాంగ్రెస్

దాడులపై బీజీపీలోని పెద్దల విరుద్ధ ప్రకటనలు: రషీద్

భారత్ జవాన్లపై తమకు పూర్తి నమ్మకం ఉందని, కానీ బీజేపీ ప్రభుత్వాన్ని విశ్వసించలేమని రషీద్ అల్వీ అన్నారు. సర్జికల్ స్ట్రైక్‌కు సంబంధించి బీజేపీ సీనియర్లు, కేంద్రంలోని పెద్దలు విరుద్ధ ప్రకటనలు చేసినట్లు ఆయన చెప్పారు. ఎవరూ చనిపోయే అవకాశం లేని ప్రదేశంలో వైమానిక దాడి జరిగిందని సుష్మా స్వరాజ్ మంత్రిగా ఉన్నట్లు స్పందించినట్లు రషీద్ గుర్తు చేశారు. 300 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని అమిత్ షా ఒకసారి చెప్పారని పేర్కొన్నారు. 400 మందికి పైగా హతమయ్యారని యూపీ సీఎం యోగీ మరో సందర్భంలో చెప్పారని అల్వీ వివరించారు. నాయకుడిని బట్టి సంఖ్య మారుతూ వస్తోందని అల్వీ ఎద్దేవా చేశారు. కాబట్టి ప్రభుత్వం వీడియో చూపించాలని డిమాండ్ చేశారు.