Page Loader
దిల్లీలో స్కూటీని ఢీకొట్టి 350మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు, ఇద్దరు యువకులు మృతి
దిల్లీలో స్కూటీని ఢీకొట్టి 350మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు

దిల్లీలో స్కూటీని ఢీకొట్టి 350మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు, ఇద్దరు యువకులు మృతి

వ్రాసిన వారు Stalin
Jan 28, 2023
11:58 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలోని సుల్తాన్‌పురిలో జరిగిన అంజలి తరహా ఘటన దేశ రాజదానిలో మరొకటి చోటుచేసుకుంది. స్కూటీ‌పై వెళ్తున్న ఇద్దరు యువకులను కారు ఢీకొట్టింది. ఆ తర్వాత వారిని 350 మీటర్లు లాక్కెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం దిల్లీలోని కేశవపురంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులు ఐదుగురు ఉన్నట్లు చెప్పిన పోలీసులు, వారిని అరెస్టు చేసిన పేర్కొన్నారు. హిట్ అండ్ రన్ కేసులు ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతున్నాయి. దిల్లీలో అంజలీ ఘటన వెలుగులోకి వచ్చాక అలాంటి సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. ఇటీవల గుజరాత్ సూరత్‌లో దంపతులు వెళ్తున్న బైక్‌ను ఓ కారు ఢీకొట్టి, బైకర్‌ను దాదాపు 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది.

దిల్లీ

కారులో ఉన్న యువకులు మద్యం మత్తులో ఉన్నారు: పోలీసులు

19 నుంచి 21 సంవత్సరాల వయస్సు గల ఐదుగురు విద్యార్థులు వివాహ వేడుక నుంచి తిరిగి వస్తూ, శుక్రవారం తెల్లవారు జామున 3 గంటలకు హోండా యాక్టివా స్కూటర్‌ను కారుతో ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో వారు మద్యం మత్తులో ఉన్నట్లు చెప్పారు. స్కూటీని కారు ఢీకొట్టగానే ఇద్దరిలో ఒక యువకుడు ఎగిరి కారు పైకప్పుపై పడిపోయాడని, మరొకరు కారు బ్యానెట్‌లో ఇరుక్కుపోయినట్లు పోలీసులు చెప్పారు. కారు బంబర్‌లో స్కూటీ ఇరుక్కున్నట్లు పేర్కొన్నారు. అలాగే ప్రమాదంలో చనిపోయిన ఇద్దరు యువకులను కైలాశ్ భట్నాగర్, సుమిత్ ఖరీగా పోలీసులు గుర్తించారు.