Cyclone Arnab: అర్నబ్ తుపాను ప్రభావం.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
అర్నబ్ తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. విజయనగరం జిల్లా గరివిడిలో అత్యధికంగా 26 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అనకాపల్లిలో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శృంగవరపుకోట, వేపాడ, చీపురుపల్లిలోనూ 25 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం, విజయనగరం జిల్లా మెంటాడ, అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయనగరం జిల్లాలోని గంట్యాడ, శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలంలో 23 సెంటీమీటర్ల వర్షం కురిసింది. విజయనగరం జిల్లాలోని గజపతినగరం, నెల్లిమర్ల, మెరకముడిదాంతో పాటు విశాఖపట్నం నగరంలో 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయనగరంలో 21 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్..
— PulseNewsBreaking (@pulsenewsbreak) October 28, 2026
ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
అత్యధికంగా అనకాపల్లి జిల్లా కశింకోటలో 26.3 సెం.మీ వర్షపాతం నమోదు
విజయనగరం జిల్లా భోగాపురంలో 26.2 సెం.మీ, వేపాడలో 23.6 సెం.మీ వర్షపాతం
విశాఖపట్నంలో 26 సెం.మీ,
పరవాడలో 24.7 సెం.మీ,
పెందుర్తిలో 24.2 సెం.మీ,… pic.twitter.com/i3t18xupBS