Page Loader
CM Jagan: డిసెంబర్‌లో వైజాగ్‌కు మకాం మారుస్తున్నా.. ఇక పాలన ఇక్కడి నుంచే: సీఎం జగన్‌ 
డిసెంబర్‌లో వైజాగ్‌కు మకాం మారుస్తున్నా.. ఇక పాలన ఇక్కడి నుంచే: సీఎం జగన్‌

CM Jagan: డిసెంబర్‌లో వైజాగ్‌కు మకాం మారుస్తున్నా.. ఇక పాలన ఇక్కడి నుంచే: సీఎం జగన్‌ 

వ్రాసిన వారు Stalin
Oct 16, 2023
02:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

డిసెంబర్‌లో తన నివాసాన్ని విశాఖపట్నంకు మారుస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం తెలిపారు. మధురవాడలోని ఐటీ సెజ్‌లో ఇన్ఫోసిస్ బిజినెస్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి అనువైన స్థలం కోసం అన్వేషణ జరుగుతోందని, సీఎంఓ ఏర్పాటు చేసిన తర్వాత తాను వైజాగ్‌కు షిఫ్ట్ అవుతానని చెప్పారు. డిసెంబర్‌ కల్లా తాను ఇక్కడికి వచ్చి, వైజాగ్ నుంచే పాలన సాగిస్తానన్నారు. మరిన్ని ఐటీ సంస్థలు వైజాగ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నందున హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ఇతర నగరాలతో సమానంగా విశాఖపట్నం అభివృద్ధి చెందే అవకాశం ఉందని ముఖ్యమంత్రి అన్నారు.

సీఎం

వచ్చే ఏడాది అదానీ డేటా సెంటర్ ప్రారంభం 

విశాఖపట్నం ఐటీ, పారిశ్రామిక వృద్ధిలో ఇన్ఫోసిస్ కీలక పాత్ర పోషిస్తుదని సీఎం జగన్ అన్నారు. వచ్చే ఏడాది అదానీ డేటా సెంటర్ ప్రారంభం విశాఖపట్నం ఐటీ వ్యాపారం మొత్తం ల్యాండ్‌స్కేప్‌ను మారుస్తుందన్నారు. విశాఖపట్నంలో మానవ వనరుల కొరత లేదని, నగరంలో ఎనిమిది యూనివర్సిటీలు, 14 ఇంజినీరింగ్ కాలేజీలు, 12 డిగ్రీ కాలేజీలు ఉన్నాయని, ఏటా 13 వేల మంది ఇంజనీర్లను తయారు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. అదనంగా నగరంలో ఐఐఎం, నేషనల్ లా యూనివర్సిటీ, మారిటైమ్ యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఇన్ఫోసిస్ సీనియర్ డైరెక్టర్ నిరంజన్ రాయ్, మంత్రులు గుడివాడ అమర్‌నాథ్, విడదల రజనీ, మేయర్ జి హరి వెంకట కుమారి, రీజినల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు.