
Operation Abhyas: 'ఆపరేషన్ అభ్యాస్' పేరుతో రేపు హైదరాబాద్‌లో డిఫెన్స్ మాక్ డ్రిల్
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ నగరంలో రేపు (బుధవారం) 'ఆపరేషన్ అభ్యాస్' పేరిట డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ డ్రిల్ సందర్భంగా నగరవ్యాప్తంగా సైరన్లు మోగించనున్నారు. సైరన్ శబ్దం వినిపించిన వెంటనే ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాల్సి ఉంటుంది.
మధ్యాహ్నం 4.15 గంటలకు నగరంలోని నాలుగు విభిన్న ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్‌ను ప్రారంభిస్తారు.
అనంతరం 4.20 గంటల వరకు సంబంధిత ప్రాంతాలకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎస్డీఆర్‌ఎఫ్, వైద్య, రెవెన్యూ, స్థానిక అధికారులు చేరుకుంటారు.
అత్యవసర పరిస్థితులలో ఏ విధంగా స్పందించాలో, ఎలా ప్రవర్తించాలో ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ డ్రిల్ లక్ష్యంగా ఉంది.
వివరాలు
ప్రతి కూడలిలో రెండు నిమిషాలపాటు సైరన్లు
ఈ మాక్ డ్రిల్‌లో మొత్తం 12 సివిల్ డిఫెన్స్ సేవలు పాల్గొననున్నాయి.
సాయంత్రం 4 గంటలకు నగరంలోని నాలుగు భిన్న ప్రాంతాల్లో ఎయిర్ రైడ్ డ్రిల్‌ను నిర్వహించనున్నారు.
ఈ ప్రయోగంలో భాగంగా, నగరవ్యాప్తంగా సైరన్లు మోగించబడతాయి.
ప్రతి కూడలిలో రెండు నిమిషాలపాటు సైరన్లు వినిపించనున్నాయి.
సైరన్ మోగిన వెంటనే విద్యుత్ పరికరాలు, లైట్లు, స్టవ్‌లు వాడకూడదని అధికారులు ప్రజలకు సూచించారు.