LOADING...
ఉత్తరాఖండ్: వర్షాల కారణంగా కూలిన డెహ్రాడూన్‌లోని తప్కేశ్వర్ మహాదేవ్ ఆలయం 
ఉత్తరాఖండ్: వర్షాల కారణంగా కూలిన డెహ్రాడూన్‌లోని తప్కేశ్వర్ మహాదేవ్ ఆలయం

ఉత్తరాఖండ్: వర్షాల కారణంగా కూలిన డెహ్రాడూన్‌లోని తప్కేశ్వర్ మహాదేవ్ ఆలయం 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 21, 2023
03:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తరాఖండ్‌ను ఎడతెరపిలేకుండా వర్షాలు అతలాకుతలం చేస్తుండడంతో గత కొన్ని రోజులుగా జనజీవనం స్తంభించింది. దానికితోడు వాగులు, వంకలు పొంగి పొర్లడంతో పలు ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. దింతో ఇళ్లు వరద ప్రవాహానికి కొట్టుకుపోతున్నాయి.అలాగే పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ భారీ వర్షానికి డెహ్రాడూన్‌ లోని ప్రసిద్ధ తప్కేశ్వర్‌ మహాదేవ్‌ ఆలయంలోని ఒక భాగం కుప్పకూలింది. ఆలయం దగ్గరలో చెట్లు కూలడంతో గుడిలోకి ప్రవేశించే మార్గం పాక్షికంగా మూసుకుపోయింది. సోమవారం సావనాన్ని పురస్కరించుకొని పూజల కోసం ఆలయానికి వచ్చిన భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ఉత్తరాఖండ్‌ నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని IMD హెచ్చరించడంతో రాష్ట్రంలోని పౌరి, డెహ్రాడూన్‌, నైనిటల్‌, చంపావత్‌, భాగేశ్వర్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భారీ వర్షాలకు కూలిన తప్కేశ్వర్ మహాదేవ్ ఆలయం