Loading...
BRICS Summit 2026: బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు వేళ ఢిల్లీలో హోటల్ గదులకు భారీగా పెరిగిన డిమాండ్
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు వేళ ఢిల్లీలో హోటల్ గదులకు భారీగా పెరిగిన డిమాండ్

BRICS Summit 2026: బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు వేళ ఢిల్లీలో హోటల్ గదులకు భారీగా పెరిగిన డిమాండ్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 07, 2026
04:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో హోటల్ గదుల అద్దెలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. సాధారణ రోజుల్లో గరిష్ఠంగా రూ.1 లక్ష వరకు ఉండే కొన్ని లగ్జరీ సూట్ల ధరలు.. ప్రస్తుతం ఒక్క రాత్రికి రూ.14 లక్షలకు పైగా పలుకుతున్నాయి. త్వరలో జరగనున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు-2026 ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ప్రపంచ దేశాల అధినేతలు, విదేశీ దౌత్యవేత్తలు, అంతర్జాతీయ ప్రతినిధులు ఢిల్లీకి రానుండటంతో నగరంలోని ఆతిథ్య రంగంలో డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. కొన్ని హోటళ్లలో గదులు అందుబాటులో లేక 'NO ROOMS' బోర్డులు పెట్టే పరిస్థితి నెలకొంది.

వివరాలు 

ఫైవ్ స్టార్ హోటళ్లలో బుకింగ్స్ ఫుల్

సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక భారత్ మండపంలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరగనుంది.

ఈ కార్యక్రమానికి హాజరయ్యే వీఐపీ అతిథులు, భద్రతా సిబ్బంది, అంతర్జాతీయ ప్రతినిధుల వసతి కోసం కేంద్ర విదేశాంగ శాఖ ఇప్పటికే ప్రత్యేక రిజర్వేషన్లు చేసుకున్నట్లు తెలుస్తోంది.

దీంతో లూటియన్స్ ఢిల్లీ, ఏరోసిటీ ప్రాంతాల్లోని ప్రముఖ ఫైవ్ స్టార్ హోటళ్లలో సాధారణ బుకింగ్స్‌కు స్థలం లేకుండా పోయింది.

తాజ్ మహల్ హోటల్, తాజ్ ప్యాలెస్, ది లీలా ప్యాలెస్, లీ-మెరిడియన్, ది లలిత్ వంటి హోటళ్లలో సాధారణ రిజర్వేషన్లు నిలిచిపోయినట్లు సమాచారం.

వివరాలు 

డిమాండ్‌కు అనుగుణంగా అద్దెల పెంపు

గదుల లభ్యత తగ్గిపోవడంతో కొన్ని హోటళ్లు డైనమిక్ ప్రైసింగ్ విధానాన్ని అమలు చేస్తున్నాయి.

సాధారణ రోజుల్లో రూ.70 వేల నుంచి రూ.1.5 లక్షల మధ్య ఉండే ప్రెసిడెంట్, సూపర్ లగ్జరీ సూట్ల అద్దెలు.. డిమాండ్, తేదీలను బట్టి ఒక్కసారిగా రూ.14 లక్షలకు చేరాయి.

దీంతో తరచూ ఢిల్లీకి వచ్చే వ్యాపారవేత్తలు సైతం ఈ ధరలు చూసి ఆశ్చర్యపోతున్నారు.

ఇక ఎగ్జిక్యూటివ్, డీలక్స్ కేటగిరీ గదుల సాధారణ అద్దెలు రోజుకు రూ.1.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉంటాయి.

అయితే బ్రిక్స్ సదస్సు తేదీల్లో డిమాండ్ పెరగడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

కొన్ని హోటళ్లు ఇప్పటికే ఆ తేదీలకు సంబంధించిన ఆన్‌లైన్ బుకింగ్ పోర్టల్స్‌ను కూడా మూసివేసినట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT

వివరాలు 

ఎన్‌సీఆర్, గురుగ్రామ్, నోయిడాకు పెరిగిన డిమాండ్

సెంట్రల్ ఢిల్లీలో గదులు దొరకడం కష్టంగా మారడంతో విదేశీ ప్రతినిధులు, పర్యాటకులు, కార్పొరేట్ వ్యాపారవేత్తలు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు.

ముఖ్యంగా ఎన్‌సీఆర్, గురుగ్రామ్, నోయిడాలోని స్టార్ హోటళ్లలో బస చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

గత ఏడాదితో పోలిస్తే ఈ సమయంలో హోటల్ బుకింగ్స్ కోసం సెర్చ్‌లు దాదాపు 50 శాతం పెరిగినట్లు ప్రముఖ ట్రావెల్ పోర్టల్స్ వెల్లడించాయి.

ADVERTISEMENT

వివరాలు 

భద్రతా ఏర్పాట్లు ముమ్మరం

అంతర్జాతీయ స్థాయి సదస్సు కావడంతో ఢిల్లీ ప్రభుత్వం, ట్రాఫిక్ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

ముఖ్యంగా ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి భారత్ మండపం వరకు సాగే మార్గాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు.

ప్రపంచ దేశాల అధినేతలు, విదేశీ ప్రతినిధుల రాక నేపథ్యంలో ట్రాఫిక్ నిర్వహణతో పాటు హై సెక్యూరిటీ చర్యలను ముమ్మరం చేశారు.

ADVERTISEMENT