Page Loader
Air India: దిల్లీ-న్యూయార్క్‌ ఫ్లైట్‌.. వడ్డించిన ఆహారంలో బొద్దింక.. చిన్నారికి ఫుడ్‌ పాయిజన్‌
దిల్లీ-న్యూయార్క్‌ ఫ్లైట్‌.. వడ్డించిన ఆహారంలో బొద్దింక.. చిన్నారికి ఫుడ్‌ పాయిజన్‌

Air India: దిల్లీ-న్యూయార్క్‌ ఫ్లైట్‌.. వడ్డించిన ఆహారంలో బొద్దింక.. చిన్నారికి ఫుడ్‌ పాయిజన్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 29, 2024
10:02 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ నుంచి న్యూయార్క్‌ వెళ్తున్న ఎయిర్‌ ఇండియా విమానంలో వడ్డించిన ఆహారంలో బొద్దింక కనిపించడం కలకలం రేపింది. ఓ ప్రయాణికుడు విమాన సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తాజాగా ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన 2 సంవత్సరాల చిన్నారి ఆమ్లెట్‌లో సగం తిన్న తరువాతే ఈ విషయం గమనించానని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయంపై ఎయిర్‌ ఇండియాతో పాటు ఏవియేషన్‌ రెగ్యులేటర్‌ డిజిసిఎ, పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్‌ నాయుడులను ప్రయాణికుడు ట్యాగ్‌ చేశారు.

Details

స్పందించిన ఎయిర్ ఇండియా

ప్రయాణికుడి ఫిర్యాదుపై ఎయిర్‌ ఇండియా స్పందించింది. కస్టమర్‌ తెలిపిన ఈ ఘటనపై వెంటనే విచారణ ప్రారంభించామని తెలిపింది. క్యాటరింగ్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌తో ఈ విషయంలో చర్చలు జరుపుతున్నామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఎయిర్‌ ఇండియా ప్రతినిధి తెలిపారు. ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. దీంతో ప్రయాణికుల భద్రత, ఆహార నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆహరంలో బొద్దింక