NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Narendra Modi's swearing-in: మోదీ ప్రమాణ స్వీకారోత్సవం.. ఢిల్లీలో హై అలర్ట్‌ 
    తదుపరి వార్తా కథనం
    Narendra Modi's swearing-in: మోదీ ప్రమాణ స్వీకారోత్సవం.. ఢిల్లీలో హై అలర్ట్‌ 
    Narendra Modi's swearing-in: మోదీ ప్రమాణ స్వీకారోత్సవం.. ఢిల్లీలో హై అలర్ట్‌

    Narendra Modi's swearing-in: మోదీ ప్రమాణ స్వీకారోత్సవం.. ఢిల్లీలో హై అలర్ట్‌ 

    వ్రాసిన వారు Stalin
    Jun 08, 2024
    11:13 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఆదివారం ఢిల్లీలో హై అలర్ట్‌ ఉంటుంది.

    ఢిల్లీ పోలీసు అధికారుల ప్రకారం, ఐదు కంపెనీల పారామిలటరీ సిబ్బంది, ఎన్‌ఎస్‌జి కమాండోలు, డ్రోన్‌లు ,శిక్షణ పొందిన జాగిలాలతో పహారా కాస్తారు.

    బహుళ లేయర్‌ల భద్రత రాష్ట్రపతి భవన్‌ను కంటికి రెప్పలా కాపలా కాస్తుంది.

    వేడుకకు ఆహ్వానించిన సార్క్ (సౌత్ ఆసియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్) దేశాల నుండి ప్రముఖులు హాజరుకానున్నారు.

    గత సంవత్సరం G20 శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన భద్రతా కవరేజీని పోలి ఉండే అవకాశం ఉంది.

    ప్రమాణస్వీకారానికి హాజరయ్యే ప్రముఖులకు వారి హోటళ్ల నుంచి వేదిక వద్దకు, తిరిగి వెళ్లేందుకు నిర్దేశిత మార్గాలను కూడా ఏర్పాటు చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు.

    డీటెయిల్స్ 

    సిబ్బందిని నియమించాలి 

    స్నిపర్‌లు , సాయుధ పోలీసు సిబ్బంది ప్రముఖులు , డ్రోన్‌ల ఆయా మార్గాల్లో మోహరిస్తారు. అయితే దేశ రాజధానిలోని వ్యూహాత్మక ప్రదేశాలలో డ్రోన్‌లు మోహరించనున్నారు.

    ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, భూటాన్, నేపాల్, మారిషస్ సీషెల్స్ అగ్రనేతలు హాజరయ్యే అవకాశం ఉంది.

    ఇందుకోసం నగరంలోని లీలా, తాజ్, ఐటీసీ మౌర్య, క్లారిడ్జెస్ , ఒబెరాయ్ వంటి హోటళ్లు ఉన్నాయి. ఇప్పటికే భద్రత పరిధిలోకి తీసుకొచ్చారు.

    డీటెయిల్స్ 

    AI తో ఆధునిక పహారా 

    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ చొరబాటు హెచ్చరిక వ్యవస్థలు స్కానింగ్ ముఖ గుర్తింపు కోసం ఉపయోగిస్తారు.

    అయితే స్నిపర్‌లు వ్యూహాత్మక ప్రదేశాలు ఎత్తైన భవనాల వద్ద మోహరిస్తారు. రాష్ట్రపతి భవన్ వద్ద భారీ భద్రత రాష్ట్రపతి భవన్‌లో ఈ కార్యక్రమం జరగనుంది.

    దీనితో ప్రాంగణం లోపల,వెలుపల మూడంచెల భద్రతను ఏర్పాటు చేయనున్నారు.

    ఢిల్లీ పోలీసుల SWAT (ప్రత్యేక శిక్షణ బృందాలు),NSG నుండి కమాండోలు కార్యక్రమం రోజున రాష్ట్రపతి ఇంటి చుట్టూ వివిధ వ్యూహాత్మక ప్రదేశాల చుట్టూ మోహరిస్తారు.

    ఐదు కంపెనీల పారామిలటరీ , ఢిల్లీ సాయుధ పోలీసు (డిఎపి) జవాన్లతో సహా దాదాపు 2500 మంది పోలీసు సిబ్బందిని వేదిక చుట్టూ మోహరిస్తారు.

    ఇందుకు ప్రణాళిక రూపొందించామని అని ఒక అధికారి పిటిఐకి తెలిపారు.

    డీటెయిల్స్ 

    ట్రాఫిక్ మళ్లింపులు 

    ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారోత్సవం నేపథ్యంలో ఆదివారం ఢిల్లీలోని మధ్య భాగం వైపు వెళ్లే అనేక రహదారులు మూసివేయనున్నారు.

    ఉదయం నుంచి ట్రాఫిక్ మళ్లింపులు ఉండవచ్చు. ఇంకా, శనివారం నుండి దేశ రాజధాని సరిహద్దుల్లో తనిఖీలు పెంచారు.

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని పొరుగు ప్రాంతాలతో సహా పలు దేశాల నాయకులను సాదరంగా ఆహ్వానించారు.

    ఆహ్వానాన్ని అంగీకరించిన వారిలో శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజు, సీషెల్స్ వైస్ ప్రెసిడెంట్ అహ్మద్ అఫీఫ్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ 'ప్రచండ', ఉన్నారు.

    డీటెయిల్స్ 

    వేడుకకు ప్రత్యేక ఆహ్వానితులలో సామాన్యులు 

    భూటాన్ ప్రధాన మంత్రి షెరింగ్ టోబ్గే హజరు కానున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం అదే రోజు సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన విందులో నేతలు పాల్గొంటారు.

    ఈ వేడుకకు ప్రత్యేక ఆహ్వానితులలో సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న కార్మికులు, వందే భారత్ , మెట్రో రైళ్లలో పనిచేస్తున్న రైల్వే శాఖ సిబ్బంది వున్నారు.

    వీరితో పాటుగా ఉద్యోగులు, ట్రాన్స్‌జెండర్లు, పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ నుండి పారిశుధ్య కార్మికులు, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ,వికసిత్ భారత్ అంబాసిడర్లు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    దిల్లీ

    తాజా

    Pawan Kalyan: రాజధానిపై కుట్రలు చేసిన వారిని విడిచిపెట్టం : పవన్‌ కళ్యాణ్ హెచ్చరిక పవన్ కళ్యాణ్
    ENG vs IND: ఇంగ్లాండ్‌ టూర్‌కు ముందు కీలక మార్పు.. భారత జట్టుకు కొత్త కోచ్ ఇంగ్లండ్
    Tragedy : బెంగళూరులో దారుణం.. సెక్స్‌కి నిరాకరించిందని.. బాలికను హత్య చేసి సూట్‌కేస్‌లో పడేశారు! బెంగళూరు
    Thuglife : దారుణంగా పడిపోయిన థగ్ లైఫ్‌ కలెక్షన్లు.. మూడ్రోజుల్లో ఎంతంటే? కమల్ హాసన్

    నరేంద్ర మోదీ

    Priyanka Vadra-PM Modi: ఏనాడైనా కాంగ్రెస్ మీ బంగారాన్ని దోచుకుందా?: ప్రధాని మోదీ వ్యాఖ్యలకు ప్రియాంకా ధీటుగా సమాధానం కాంగ్రెస్
    PM Modi Fire-on Sam Pitroda comments: వారసత్వ సంపద పంపిణీ సిగ్గుచేటు: శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై మండిపడ్డ ప్రధాని మోదీ ప్రధాన మంత్రి
    Conspiracy Against PM is Treason!: ప్రధానిపై కుట్ర, దేశద్రోహం.. బాధ్యతారాహిత్యంగా ఎవరిపైనైనా ఆరోపణలు చేయకూడదు: ఢిల్లీ హైకోర్టు  భారతదేశం
    Election Commission: ప్రధాని మోదీ-రాహుల్ గాంధీ ప్రసంగాలపై ఎన్నికల సంఘం నోటీసు  ఎన్నికల సంఘం

    దిల్లీ

    Assam: ఐఎస్ఐఎస్‌లో సంస్థలో చేరతానని ఈమెయిల్‌.. ఐఐటీ గౌహతి విద్యార్థి అరెస్ట్ అస్సాం/అసోం
    Jaggi Vasudev: బ్రెయిన్ సర్జరీ తర్వాత కోలుకుంటున్న సద్గురు.. హెల్త్‌ అప్‌డేట్‌ ఇచ్చిన సద్గురు  భారతదేశం
    Liquor Policy Case: ఆప్ నేత కైలాష్ గెహ్లాట్‌కు ఈడీ సమన్లు ​​  భారతదేశం
    Loktantra Bachao: నేడు విపక్ష ఇండియా కూటమి నేతృత్వంలో 'లోక్‌తంత్ర బచావో ర్యాలీ'  అరవింద్ కేజ్రీవాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025