Loading...
CJP: జంతర్ మంతర్‌లోకి ప్రవేశించిన CJP నేతలు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు
జంతర్ మంతర్‌లోకి ప్రవేశించిన CJP నేతలు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

CJP: జంతర్ మంతర్‌లోకి ప్రవేశించిన CJP నేతలు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 13, 2026
10:00 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జంటా పార్టీ (CJP) నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం అక్కడికి చేరుకున్న పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్, జాతీయ అధికార ప్రతినిధి ఆశుతోష్ రంకాను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కూడా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాతో పాటు అజింక్య షిండే, ఇతర పార్టీ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అభిజీత్ దీప్కే చేసిన ట్వీట్ 

వివరాలు 

నిరసనను అడ్డుకోలేరంటూ..

జంతర్ మంతర్‌లోకి ప్రవేశించామని, ఇప్పుడు తమను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారని సౌరవ్ దాస్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

యువతకు ఇది ఒక సందేశమని, తాము అనుకున్నది సాధించగలమని పేర్కొన్నారు.

జాతీయ జెండాలు పట్టుకున్న పార్టీ సభ్యులు జంతర్ మంతర్‌లోకి ప్రవేశించారని, ఆ తర్వాత ఢిల్లీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారని అభిజీత్ దీప్కే వెల్లడించారు.

నిరసనను అడ్డుకోలేరంటూ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.

ADVERTISEMENT

వివరాలు 

అభిజీత్ దీప్కే విమర్శలు

జంతర్ మంతర్‌ను నిరసనలకు కేటాయించిన ప్రాంతాల జాబితా నుంచి తొలగించడంపై అభిజీత్ దీప్కే విమర్శలు చేశారు.

ఈ విషయంపై వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడుతూ.. జంతర్ మంతర్‌ను నిరసన స్థలంగా తొలగిస్తే ఆందోళనలు ఆగిపోతాయని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నారని అన్నారు.

అయితే, నిరసనలు ఆగవని, దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఆందోళనలు మొదలవుతాయని పేర్కొన్నారు.

తమ సమస్య జంతర్ మంతర్ అనే ప్రాంతంతో కాదని, నిరసనలతోనేనని ప్రభుత్వ వైఖరి స్పష్టం చేస్తోందని వ్యాఖ్యానించారు.

నిరసన తెలిపేందుకు ఒక ప్రాంతాన్ని తొలగించినంత మాత్రాన ప్రజల ఆందోళనలను ఆపలేరని అభిప్రాయపడ్డారు.

ADVERTISEMENT