Closure of metro stations: దిల్లీలో 16 మెట్రో స్టేషన్లు మూసివేత.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనల నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో వరుసగా రెండో రోజూ 16 మెట్రో స్టేషన్లను అధికారులు మూసివేశారు. దీంతో వేలాది మంది ప్రయాణికులు రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి న్యాయవ్యవస్థ పనితీరుపైనా ప్రభావం చూపుతోందని పేర్కొంటూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (SCBA) అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మెట్రో స్టేషన్లు మూసివేయడంతో న్యాయవాదులు, వ్యాజ్యదారులు,కోర్టు సిబ్బంది సకాలంలో సుప్రీంకోర్టుకు చేరుకోలేకపోతున్నారని పిటిషన్‌లో వివరించింది. ఈ అంశంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను కోరింది.
వివరాలు
పార్లమెంట్‌లో అధికార, విపక్ష ఎంపీల పోటాపోటీ నిరసనలు
దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి.. ముందుగా మధ్యాహ్నం వరకు పరిస్థితిని గమనిద్దామని తెలిపారు.
ఆ తర్వాత కూడా సమస్య కొనసాగితే లేదా పరిష్కారం లభించకపోతే సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేందుకు సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం పార్లమెంట్‌ను మరోసారి కుదిపేసింది.
ఈ అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించినప్పటికీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ విపక్ష సభ్యులు పట్టుబట్టారు.
దీంతో గురువారం కూడా లోక్‌సభ, రాజ్యసభల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.
వివరాలు
పార్లమెంట్‌లో అధికార, విపక్ష ఎంపీల పోటాపోటీ నిరసనలు
సభల్లో ఆందోళనకర పరిస్థితులు కొనసాగడంతో ఉభయ సభలను పలుమార్లు వాయిదా వేశారు.
అనంతరం పార్లమెంట్ మకరద్వారం వద్ద విపక్ష ఎంపీలు నిరసన చేపట్టారు.
వారికి ప్రతిస్పందనగా ఎన్డీయే కూటమికి చెందిన ఎంపీలు కూడా నినాదాలు చేస్తూ ప్రత్యామ్నాయ నిరసన నిర్వహించారు.
దీంతో పార్లమెంట్ ప్రాంగణంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య పోటాపోటీ ఆందోళనలు చోటుచేసుకున్నాయి.