Page Loader
దిల్లీ ప్రమాదం రిపీట్: నోయిడాలో స్విగ్గీ డెలివరీ బాయ్‌ను కిలోమీటర్ లాక్కెళ్లిన కారు
నోయిడాలో దిల్లీ తరహా ప్రమాదం

దిల్లీ ప్రమాదం రిపీట్: నోయిడాలో స్విగ్గీ డెలివరీ బాయ్‌ను కిలోమీటర్ లాక్కెళ్లిన కారు

వ్రాసిన వారు Stalin
Jan 05, 2023
02:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలోని సుల్తాన్‌పురి ఘటన మరవక ముందే... నోయిడాలో అలాంటి ప్రమాదమే వెలుగులోకి వచ్చింది. న్యూ ఇయర్ రోజు రాత్రి నోయిడాలో స్విగ్గీ డెలివరీ బాయ్ కౌశల్ యాదవ్ బైక్‌ను కారు ఢీకొట్టడంతో పాటు కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో కౌశల్ యాదవ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురిలో నివసిస్తున్న కౌశల్ యాదవ్ స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నారు. న్యూ ఇయర్ రాత్రి 1 గంటకు నోయిడాలోని సెక్టార్ 14 ఫ్లైఓవర్ పై వెళుతుండగా... అతని బైక్‌ను గుర్తు తెలియని కారు ఢీకొట్టింది. కారు డ్రైవర్ వాహనాన్ని వెంటనే ఆపకుండా... కిలో మీటర్ దూరంలో ఉన్న శని ఆలయం వద్ద వెళ్లి ఆపాడు. దీంతో కౌశల్ యాదవ్ మృతదేహం అక్కడే అగిపోయింది.

నోయిడా

ఆక్సిడెంట్ పై ఫేజ్-1 పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

ఆ‌రోజు రాత్రి ప్రమాదం జరిగిన తర్వాత కుటుంబ సభ్యులు కౌశల్‌కు కాల్ చేశారు. ఆ సమయంలో అటు వెళ్తున్న క్యాబ్ డ్రైవర్ ఫోన్ తీసుకొని మాట్లాడి ప్రమాదం గురించి కుటుంబ సభ్యులకు చెప్పాడు. కౌశల్‌కు యాక్సిడెంట్ అయ్యిందని, శని దేవాలయం దగ్గర రోడ్డుపై పడి ఉన్నాడని క్యాబ్ డ్రైవర్ చెప్పినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ మేరకు ఫేజ్-1 పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. అలాగే కుటుంబ సభ్యులకు యాక్సిడెంట్ గురించి చెప్పిన క్యాబ్ డ్రైవర్‌ను కూడా విచారిస్తున్నారు.