Delhi: యువకుడిపై కత్తులతో దాడి చేసి హత్య చేసిన ప్రియురాలి కుటుంబ సభ్యులు
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలోని జాఫ్రాబాద్‌లో దారుణం జరిగింది. 25ఏళ్ల యువకుడిని కత్తులతో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. చనిపోయిన యువకుడిని పోలీసులు సల్మాన్‌గా గుర్తించారు.
సల్మాన్‌పై అతని ప్రియురాలి తండ్రి, సోదరులు కత్తులతో దాడి చేశారు. మెడ, ఛాతీపై బలమైన కత్తిపోటు గాయాలు కావడంతో సల్మాన్ అక్కడికక్కడే మరణించారు.
ఈ ఘటన మొత్తం ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యింది.
దిల్లీ
నిందితుల కోసం పోలీసుల గాలింపు
పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఓ యువతి, సల్మాన్ మధ్య రెండేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది.
వీరి ప్రేమను యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో తన కుతురిని ప్రేమిస్తున్న సల్మాన్‌ను హత్య చేయాలని యువతి తండ్రి, సోదరులు నిర్ణయించుకున్నారు.
సల్మాన్ సోమవారం మధ్యహ్నం తన మోటార్‌సైకిల్‌పై వెళుతుండగా అతనిపై ఈ ముగ్గురు దాడి చేశారు.
పదునైన ఆయుధాలతో దాడి చేయడంతో తీవ్రంగా రక్తస్రావం జరిగి, సల్మాన్ అక్కడికక్కడే చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.
హత్యను చూసి సల్మాన్ ఇద్దరు సహచరులు సంఘటనా స్థలం నుంచి పారిపోయారు. దిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు.