
ఐఫోన్ కోసం డెలివరీ బాయ్ హత్య- నాలుగురోజులుగా బాత్‌రూమ్‌లోనే మృతదేహం
ఈ వార్తాకథనం ఏంటి
ఐఫోన్ కోసం ఒక వ్యక్తి డెలివరీ బాయ్‌ను హత్య చేశాడు. ఈ ఘటన కర్ణాటకలో జరగ్గా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కర్ణాటకలోని హసన్ ప్రాంతానికి చెందిన హేమంత్ అనే వ్యక్తి ఇటీవల యూజ్డ్ ఐఫోన్ ఆర్డర్ చేశాడు. ఎకార్ట్ లాజిస్టిక్స్‌కు చెందిన డెలివరీ బాయ్ ఫిబ్రవరి 7వ తేదీన ఐఫోన్‌ను డెలివరీ చేయడానికి వచ్చాడు.
డబ్బు చెల్లించే ముందు తాను ఐఫోన్‌ని చెక్ చేయాలనుకున్నానని హేమంత్ చెప్పగా, డెలివరీ బాయ్ అందుకు నిరాకరించాడు. ముందుగా డబ్బులు చెల్లించాలని, ఆ తర్వాతే చూడాలని హేమంత్‌కు డెలివరీ చెప్పాడు.
డబ్బుల తీసుకోవడానికి తన ఇంట్లోకి రావాలని డెలివరీ బాయ్‌ను హేమంత్ కోరాడు. డెలివరీ బాయ్ ఇంట్లోకి రాగానే అతనిని కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు.
కర్ణాటక
రైల్వే ట్రాక్‌పైకి మృతదేహాన్ని కాల్చేసిన హేమంత్
డెలివరీ బాయ్ మృతదేహాన్ని హేమంత్ నాలుగు రోజుల పాటు తన బాత్‌రూమ్‌లో దాచాడు. మృతదేహం నుంచి దుర్వాసన వస్తోందని గుర్తించి ఆ ప్రాంతంలోని రైల్వే ట్రాక్‌పైకి తీసుకెళ్లి కాల్చాడు.
బాధితుడి స్నేహితుడు మిస్సింగ్ కేసు పెట్టగా, పోలీసులు విచారణ చేపట్టారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా అన్ని వివరాలను సేకరించారు. ఈ క్రమంలో ఐఫోన్ కోసం డెలివరీ బాయ్‌ని హేమంత్ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
పోలీసులు హేమంత్‌ను అరెస్టు చేసిన కస్టడీకి పంపారు.