Loading...
Engineering Admissions: కంప్యూటర్‌ బ్రాంచీల్లోనూ తగ్గిన డిమాండ్‌.. 11,660 సీట్లు ఖాళీ
కంప్యూటర్‌ బ్రాంచీల్లోనూ తగ్గిన డిమాండ్‌.. 11,660 సీట్లు ఖాళీ

Engineering Admissions: కంప్యూటర్‌ బ్రాంచీల్లోనూ తగ్గిన డిమాండ్‌.. 11,660 సీట్లు ఖాళీ

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 05, 2026
09:09 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఈ ఏడాది మొత్తం అందుబాటులో ఉన్న సీట్లలో సుమారు 80శాతం భర్తీ అయ్యాయి. అయితే గతంలో అత్యధిక డిమాండ్‌ ఉన్న కంప్యూటర్‌ సైన్స్‌,ఐటీ అనుబంధ బ్రాంచీల్లో కూడా ఈసారి గణనీయంగా సీట్లు ఖాళీగా మిగిలిపోవడం విశేషం. ఆయా విభాగాల్లో కేవలం 82శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌లో చివరి విడత సీట్ల కేటాయింపులను మంగళవారం విడుదల చేశారు. ఈ విడతలో కొత్తగా 3,281మంది విద్యార్థులు సీట్లు పొందారు. కన్వీనర్‌ కోటా పరిధిలో ఈడబ్ల్యూఎస్‌ సీట్లతో కలిపి మొత్తం 94,156సీట్లు అందుబాటులో ఉండగా,చివరి విడత ముగిసే నాటికి 75,054సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. దీంతో ఇంకా 19,102సీట్లు ఖాళీగా మిగిలాయి.

వివరాలు 

ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌ విభాగాలలో  14,127 సీట్లు మాత్రమే భర్తీ

కంప్యూటర్‌ సైన్స్‌,ఐటీతో పాటు సంబంధిత 19 బ్రాంచీల్లో మొత్తం 66,390 సీట్లు ఉండగా,వాటిలో 54,730 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.

ఫలితంగా ఈ విభాగాల్లోనే 11,660 సీట్లు ఖాళీగా ఉన్నాయి.

ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌ విభాగాలకు చెందిన తొమ్మిది బ్రాంచీల్లో మొత్తం 18,759 సీట్లు అందుబాటులో ఉండగా, వాటిలో 14,127 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.

అంటే ఈ విభాగంలో సుమారు 75 శాతం సీట్లు నిండాయి. సివిల్‌, మెకానికల్‌ అనుబంధ బ్రాంచీల్లో మొత్తం 7,872 సీట్లు ఉండగా, వాటిలో 5,378 సీట్లు మాత్రమే భర్తీ కావడంతో సుమారు 68 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

ఇక తాజాగా సీట్లు పొందిన వారిలో కూడా కొన్ని వందల మంది కళాశాలల్లో చేరకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

వివరాలు 

7 లోపు కళాశాలల్లో రిపోర్ట్‌ చేయాలి...

సీట్లు పొందిన విద్యార్థులు తమ సీట్‌ అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ను అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

అలాట్‌మెంట్‌ లెటర్‌లో పేర్కొన్న ట్యూషన్‌ ఫీజును ఈ నెల 7లోపు ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది.

అనంతరం సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ను పూర్తి చేసి,కేటాయించిన కళాశాలకు స్వయంగా వెళ్లి రిపోర్ట్‌ చేయడం తప్పనిసరి.

ADVERTISEMENT

వివరాలు 

7 లోపు కళాశాలల్లో రిపోర్ట్‌ చేయాలి...

రెండో విడతలో సీట్లు పొంది, తాజా కేటాయింపులో కళాశాల లేదా బ్రాంచి మారిన విద్యార్థులు కూడా కొత్తగా కేటాయించిన కళాశాలలో తప్పనిసరిగా రిపోర్ట్‌ చేయాలని ఎప్‌సెట్‌ ప్రవేశాల కమిటీ కన్వీనర్‌ శ్రీదేవసేన స్పష్టం చేశారు.

అలాగే ఇప్పటికే సీట్లు పొందిన విద్యార్థులకు బ్రాంచీ మార్పు (స్లైడింగ్‌) కోసం ఆగస్టు 12, 13 తేదీల్లో అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.

ఆసక్తి ఉన్న విద్యార్థులు నిర్ణీత గడువులో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

బ్రాంచీ మారినప్పటికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.

ADVERTISEMENT