Sindhu: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సింధుకు 9వ సీడ్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతిష్ఠాత్మక బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు 9వ సీడ్‌తో పోటీకి సిద్ధమైంది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి-చిరాగ్ శెట్టి జోడీకి 5వ సీడింగ్ దక్కగా, పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ 14వ సీడ్‌గా బరిలోకి దిగనున్నాడు. ఈ టోర్నీలోని మొత్తం ఐదు విభాగాల్లో భారత్‌కు రెండేసి ఎంట్రీలు లభించాయి. మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో జంటకు 15వ సీడింగ్ కేటాయించారు.
వివరాలు
23 వరకూ ఛాంపియన్‌షిప్..
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు అర్హతలను ఈ ఏడాది ఏప్రిల్ 28న విడుదలైన ప్రపంచ ర్యాంకింగ్స్‌ను ఆధారంగా తీసుకుని ఖరారు చేశారు.
అయితే సీడింగ్స్‌ను జులై 28 నాటి తాజా ప్రపంచ ర్యాంకింగ్స్ ప్రకారం నిర్ణయించారు.
ఇక పురుషుల సింగిల్స్‌లో చైనాకు చెందిన షి యుకి అగ్ర సీడ్‌గా నిలవగా, మహిళల సింగిల్స్‌లో దక్షిణ కొరియాకు చెందిన ఆన్ సి యంగ్ టాప్ సీడ్‌తో బరిలోకి దిగనుంది.
బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ ఈ నెల 17 నుంచి 23వ తేదీ వరకు ఢిల్లీలో నిర్వహించనున్నారు.