KTR: ఏసీబీ విచారణకు కేటీఆర్.. న్యాయవాదిని తీసుకెళ్లడానికి అనుమతి నిరాకరణ
ఈ వార్తాకథనం ఏంటి
బీఆర్ఎస్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్) ఈసీబీ కార్యాలయానికి చేరుకున్నారు.
న్యాయవాదులతో చర్చించిన తర్వాత, నందినగర్‌లోని తన నివాసం నుండి బయలుదేరిన ఆయన, ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో విచారణ కోసం అక్కడ హాజరయ్యారు.
ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్ద తన న్యాయవాదిని పోలీసులు అడ్డుకోవడంపై కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. న్యాయవాదికి అనుమతి ఇవ్వకపోవడంపై రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని కోరారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఇవాళ ఏసీబీ కార్యాలయానికి రమ్మని చెప్పారని, మొత్తం సమాచారం ప్రభుత్వ వద్దే ఉందన్నారు.
Details
కేసులకు భయపడడం లేదు
గతంలో ఒక మంత్రిగా, ప్రభుత్వంలో ఉన్నప్పుడు తాను తీసుకున్న నిర్ణయాలు తన వద్దే ఉన్నాయనుకోవడం అపోహ మాత్రమేనన్నారు.
తన వాదనను హైకోర్టులో ముందే చెప్పానని, న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసిందన్నారు. చట్టం, రాజ్యాంగం పై గౌరవంతోనే ఏసీబీ కార్యాలయానికి వచ్చానని, న్యాయవాదిని తీసుకెళ్లడమే తన హక్కు అన్నారు.
తాను మర్యాదగా విచారణకు సహకరిస్తున్నా, ఇంతమంది పోలీసుల సమూహం ఎందుకన్నారు.
ప్రస్తుతం తన ఇంటిపై దాడులు చేయిస్తారనే సమాచారం తనకు ఉందని, ఈ కేసులతో తాను భయపడడం లేదన్నారు. తాము రాజ్యాంగపరంగా పోరాడుతామని చెప్పారు.