Bhatti Vikramarka: రైతు భరోసా,రేషన్ కార్డులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన!
ఇటీవలి ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు సాధించినట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కేరళ, జార్ఖండ్, మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ స్థానాల్లో గెలుపు సాధించిందని చెప్పారు. కేరళ వయనాడ్‌లో అత్యధిక మెజారిటీతో ప్రియాంక గాంధీ విజయం సాధించారని ఆయన పేర్కొన్నారు. భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. దేశంలో రాహుల్ గాంధీకి ప్రధానమంత్రిగా చేర్పించే అవకాశాలను చూడాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో మంచి విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, త్వరలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు భేటీ అయ్యే అవకాశం ఉందని తెలిపారు.
త్వరలో రేషన్ కార్డులు
ఆర్టీసీకి ప్రతినెలా 400 కోట్ల రూపాయలు కేటాయిస్తామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పారు. గ్యాస్ ధరను రూ.500కు తగ్గించామని, రైతు భరోసాపై కసరత్తు జరుగుతోందని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల విషయానికి సంబంధించి త్వరలో విధివిధానాలు ప్రకటించబడతాయని ఆయన వివరించారు. ఆయన 2 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్నవారికి త్వరలో రేషన్ కార్డులు అందిస్తామని ప్రకటించారు. ఈ రేషన్ కార్డుల విషయంలో కొందరు హడావుడి చేస్తున్నారని విమర్శించారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ ప్రస్తావన చేసి, దాన్ని వదిలిపెట్టారని పేర్కొన్నారు. తన ప్రభుత్వం 18 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో రైతులకు సహాయం అందించినట్లు చెప్పారు.
కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు
రాహుల్ గాంధీ నేతృత్వంలో సమానమైన అవకాశాలు అందించేందుకు, కులగణన చేసి రిజర్వేషన్ అమలు చేయాలని భట్టి విక్రమార్క చెప్పారు. కులగణనా పూర్తయిన తర్వాత, రిజర్వేషన్ శాతం క్లారిటీ వస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన చెప్పారు. కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి, ప్రభుత్వంపై అనవసరంగా విమర్శలు చేస్తున్నారని చెప్పారు. 57 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని, ప్రభుత్వ కార్యక్రమాలపై సీరియస్‌గా ఉన్నామని తెలిపారు. జార్ఖండ్ ప్రజల విజయాన్ని సమిష్టిగా సాధించిందనన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మె్ల్యేలందరూ టచ్‌లో ఉన్నారని.. కేటీఆర్ , బీఆర్‌ఎస్ భ్రమల్లో బతుకుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని కూకటివేళ్లతో తొలగించడం ఎవ్వరి తరం కాదన్నారు. .
పార్టీ అధినాయకత్వం.. నిర్ణయం మేరకు మంత్రివర్గ విస్తరణ
భట్టి విక్రమార్క అభివృద్ధి పనులపై కూడా చర్చించారు. రీజినల్ రింగ్ రోడ్, మూసీ ప్రక్షాళన, ఇండస్ట్రియల్ క్లస్టర్స్ వంటి ప్రాజెక్టులపై ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. అలాగే, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు, HIG, LIG, MIG పథకాలను అమలు చేయనున్నామని చెప్పారు. పార్టీ అధినాయకత్వం... సూచనల మేరకు వారి నిర్ణయం మేరకు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్నారు.