Page Loader
డేరా బాబా స్టైలే వేరు! పొడవాటి ఖడ్గంతో కేక్ కటింగ్, వీడియో వైరల్
పొడవాటి ఖడ్గంతో కేక్ కట్ చేసిన డేరా బాబా

డేరా బాబా స్టైలే వేరు! పొడవాటి ఖడ్గంతో కేక్ కటింగ్, వీడియో వైరల్

వ్రాసిన వారు Stalin
Jan 24, 2023
05:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

పెరోల్‌‌పై జైలు నుంచి బయటకు వచ్చిన డేరా బాబా మరో వివాదంలో చిక్కుకునే అవకాశం ఉంది. తను బెయిల్‌పై విడుదలైన సందర్భంగా అనుచరులతో కలిసి బర్నావా ఆశ్రమంలో కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు డేరా బాబా. ఒకటి కాదు, ఏకంగా ఐదు భారీ కేకులను కట్ చేశారు. ఇంతవరకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ డేరా బాబా ఆ కేక్‌లను పొడవాటి ఖడ్గంతో కట్ చేయడమే అతనికి కొత్త చిక్కులు తెచ్చే పెట్టే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది. ఆయుధాల చట్టం ప్రకారం, ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శించడం నేరం. ఈ కోణంలో అతడు న్యాయ పరమైన చిక్కులు ఎదుర్కొనే అవకాశమూ లేకపోలేదు.

డేరా బాబా

గత 14నెలల్లో డేరా బాబా పెరోల్‌పై బయటకు రావడం ఇది నాలుగోసారి

తన ఇద్దరు శిష్యులపై అత్యాచారం చేసిన కేసులో 20ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా బాబాకు 40 రోజుల పెరోల్ మంజూరైంది. దీంతో హర్యానాలోని రోహ్‌తక్‌లోని సునారియా జైలు నుంచి శనివారం బయటకు వచ్చారు. అనంతరం యూపీలోని బాగ్‌పత్‌లోని తన బర్నావా ఆశ్రమానికి చేరుకున్నారు. సోమవారం అక్కడే కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ క్రిషన్ లాల్ పన్వార్, మాజీ మంత్రి క్రిషన్ కుమార్ బేడీ సహా హర్యానాకు చెందిన కొంతమంది బీజేపీ నేతలు కూడా పాల్గొన్నట్లు సమాచారం. గత 14నెలల్లో డేరా బాబా పెరోల్‌పై బయటకు రావడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. శనివారం డేరా బాబాకు పెరోల్ మంజూరైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి.