
గుజరాత్‌లో కుండపోత వర్షం; 9మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో గత 24 గంటల్లో భారీ వర్షాలు కురిశాయని, నగరాలు, గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని అధికారులు శనివారం తెలిపారు.
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డీఆర్‌ఎఫ్) బృందాలను కచ్, జామ్‌నగర్, జునాగఢ్, నవ్‌సారి లాంటి ప్రభావితమైన జిల్లాల్లో మోహరించినట్లు వెల్లడించారు.
గత రెండు రోజుల్లో భారీ వర్షాల కారణం జరిగిన ప్రమాదాల్లో 9మంది మంది ప్రాణాలు కోల్పోయారని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ (ఎస్ఈఓసీ) తెలిపింది.
ఎస్ఈఓసీ పంచుకున్న డేటా ప్రకారం, శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి రాష్ట్రంలోని 37 తాలూకాల్లో 100 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.
గుజరాత్
జునాగఢ్‌లో 398 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం
జునాగఢ్ జిల్లాలోని విసావదర్ తాలూకాలో శనివారం ఉదయం 6 గంటలకు సమయానికి 398మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది.
జామ్‌నగర్ జిల్లాలోని జామ్‌నగర్ తాలూకా (269మిమీ), వల్సాద్‌లోని కప్రద(247 మిమీ), కచ్‌లోని అంజర్ (239మిమీ), నవ్‌సారిలోని ఖేర్గామ్ (222మిమీ)లో అత్యంత దెబ్బతిన్న ప్రాంతాలుగా ఎస్ఈఓసీ పేర్కొంది.
దీనివల్ల లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచి గ్రామాలు మునిగిపోయాయి. అహ్మదాబాద్ నగరంలోని అనేక ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి.
ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ శుక్రవారం రాత్రి గాంధీనగర్‌లోని ఎస్ఈఓసీ అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయడంతో సహా రెస్క్యూ పనులపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.