Page Loader
PM Modi: అభివృద్ధి గెలిచింది.. ఎక్స్ వేదికగా స్పందించిన మోదీ
అభివృద్ధి గెలిచింది.. ఎక్స్ వేదికగా స్పందించిన మోదీ

PM Modi: అభివృద్ధి గెలిచింది.. ఎక్స్ వేదికగా స్పందించిన మోదీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 23, 2024
06:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. అభివృద్ధి, సుపరిపాలన గెలిచాయంటూ, మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్‌ చేశారు. అభివృద్ధి, సుపరిపాలన గెలిచాయని, ఐక్యంగా ముందుకు సాగితే, భవిష్యత్తులో మరిన్ని శిఖరాలు అధిరోహించగలమని చెప్పారు. ఈ విజయం అందించిన మహారాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా మహిళలు, యువతకు తన కృతజ్ఞతలు తెలిపారు. జార్ఖండ్‌లో విజయం సాధించిన జేఎంఎం కూటమికి అభినందనలు తెలిపారు.

Details

221 సీట్లను గెలుచుకున్న మహాయతి కూటమి

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల విషయానికి వస్తే, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 288 అసెంబ్లీ స్థానాలలో 221 సీట్లు గెలుచుకుంది. ఇంకా 8 చోట్ల ఆధిక్యంలో ఉంది. ప్రతిపక్ష కూటమి ఎంవీఏ తీవ్ర పోటీ ఇవ్వలేకపోయింది. మహాయుతి విజయంతో, విపక్షం ఇప్పటివరకు కేవలం 45 స్థానాల్లో విజయం సాధించగా, 10 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.