
Air India: ఎయిర్ ఇండియాకు డీజీసీఏ హెచ్చరిక.. ఎందుకంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఎయిర్ ఇండియా మరోసారి వివాదంలో చిక్కుకుంది. పైలట్ల గరిష్ట ఫ్లైట్ టైమ్ నిబంధనలను ఉల్లంఘించడం, విమానయాన డైరెక్టరేట్ జనరల్ (DGCA) 10 గంటల గరిష్ట ఫ్లైట్ టైమ్ పరిమితిని అతిక్రమించినట్లు తెలుస్తోంది. విమాన సురక్షా ప్రమాణాలను అత్యున్నత స్థాయిలో పాటించాలని ఆదేశాలను డీజీసీఏ జారీ చేసింది. అహ్మదాబాద్‌లో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరిగిన తరువాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. డీజీసీఏ తన తనిఖీల్లో భాగంగా మే 16, 17 తేదీల్లో బంగ్లూరు-లండన్ (AI133) విమానాలు 10 గంటల గరిష్ట ఫ్లైట్ టైమ్‌ను ఉల్లంఘించినట్లు గుర్తించారు.
Details
స్పందించిన ఎయిర్ ఇండియా ప్రతినిధి
గత ఏప్రిల్ 24న పాకిస్తాన్ తన గగనతలాన్ని భారతీయ ఎయిర్‌లైన్స్‌కు మూసివేయడంతో, ఎయిర్ ఇండియాకు ప్రత్యేక మినహాయింపు ఇచ్చారు. అయితే ఆ అనుమతిని ఇతర ఫ్లైట్లకూ వర్తింపజేయడం వివాదానికి దారితీసింది. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా ప్రతినిధి ధృవీకరిస్తూ సరిహద్దు గగనతల మూసివేత కారణంగా ఇచ్చిన ప్రత్యేక అనుమతిని వేరుగా అర్థం చేసుకోవడం వల్ల ఈ సమస్య తలెత్తిందని తెలిపారు.