
DGMO చర్చలకు బ్రేక్.. భారత్-పాక్ భేటీ అనూహ్యంగా వాయిదా!
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశం - పాకిస్థాన్ మధ్య ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు జరగాల్సిన డీజీఎంఓ (DGMO) స్థాయి చర్చలు ఆకస్మికంగా వాయిదా పడ్డాయి.
మే 10, 2025న ఇరు దేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరింత బలపరిచే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ, అనూహ్యంగా ఇవి సాయంత్రానికి వాయిదా వేశారు.
వాయిదా వెనుక కారణాలపై అధికారికంగా ఎలాంటి సమాచారం బయటపడలేదు. తాజా షెడ్యూల్ ప్రకారం ఈ చర్చలు ఇవాళ సాయంత్రం 5 గంటలకు జరగనున్నాయి.
ఈ భేటీలో భారత డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాకిస్థాన్ డీజీఎంఓ మేజర్ జనరల్ కాశిఫ్ చౌదరి పాల్గొనబోతున్నారు.
Details
సింధూ జలాల ఒప్పందపై ఆసక్తి
చర్చల్లో ప్రధానాంశాలు కాల్పుల విరమణ కొనసాగింపు, సరిహద్దుల్లో ఉద్రిక్తతల తగ్గింపు, పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)కు సంబంధించి వివాదాల పరిష్కారం వంటి అంశాలపై దృష్టిసారించనున్నారు.
ఇటీవల పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకున్న దౌత్యపరమైన కఠిన నిర్ణయాలు, అలాగే సింధూ జలాల ఒప్పందంపై భారత ప్రభుత్వం తీసుకోబోయే వైఖరిపై ప్రజల్లో విశేష ఆసక్తి నెలకొంది.
ఈ చర్చల ఫలితాలపై సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని కోరుకునే ప్రజలు ఎంతో ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు.