Loading...
Udhayanidhi Stalin: త్రిష,విజయ్ లపై వివాదాస్పద వ్యాఖ్యలు.. DMK నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్

Udhayanidhi Stalin: త్రిష,విజయ్ లపై వివాదాస్పద వ్యాఖ్యలు.. DMK నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 04, 2026
11:32 am

ఈ వార్తాకథనం ఏంటి

కావేరీ నదీ జలాల వివాదం తమిళనాడు రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఈ అంశంపై తంజావూరులో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి కేంద్రబిందువయ్యాయి. నటి త్రిషను పరోక్షంగా ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం విచారణ నిమిత్తం ఉదయనిధిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సోమవారం నిర్వహించిన కావేరీ జలాల పరిరక్షణ నిరసనలో ప్రసంగించిన ఉదయనిధి,విజయ్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. డెల్టా ప్రాంత రైతుల ప్రయోజనాలను కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఆయన ప్రసంగం కొనసాగుతున్న సమయంలో అక్కడున్న కార్యకర్తలు"త్రిష.. త్రిష" అంటూ నినాదాలు చేశారు.

వివరాలు 

రాజకీయ పార్టీల నుంచి తీవ్ర అభ్యంతరాలు

ఆ నినాదాల మధ్యే తన ప్రసంగాన్ని కొనసాగించిన ఉదయనిధి, నటి త్రిషను పరోక్షంగా ప్రస్తావిస్తూ ద్వంద్వార్థం వచ్చేలా వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

అయితే ఈ వివాదంపై స్పందించిన ఆయన, తాను చేసిన వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి కాదని, కావేరీ నది అంశాన్నే ప్రస్తావించానని వివరణ ఇచ్చారు.

అయినప్పటికీ ఆయన వ్యాఖ్యలపై రాజకీయ పార్టీల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

టీవీకే నేతలు స్పందిస్తూ, ఇలాంటి అవమానకరమైన వ్యాఖ్యలు ప్రజా జీవితంలో ఉన్న నాయకుడికి తగవని మండిపడ్డారు.

డీఎంకే రాజకీయ ప్రమాణాలు దిగజారుతున్నాయనేందుకు ఇవే నిదర్శనమని విమర్శించారు.

వివరాలు 

జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయించిన టీవీకే పార్టీ

భారతీయ జనతా పార్టీ నేతలు కూడా ఉదయనిధి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

ప్రజా వేదికపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని, మహిళల పట్ల గౌరవం చూపాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై మరింత ఉంటుందని పేర్కొన్నారు.

ఉదయనిధి తీరుపై టీవీకే పార్టీ జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది.

ఆయన చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని కమిషన్‌ను కోరింది.

అలాగే ఎలాంటి షరతులు లేకుండా ఉదయనిధి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.

ADVERTISEMENT

వివరాలు 

హైకోర్టును ఆశ్రయించిన ఉదయనిధి

ఈ వివాదం తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపింది.

డీఎంకే, టీవీకే నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇదే సమయంలో ఉదయనిధి నివాసం ఎదుట విజయ్ అభిమానులు, మద్దతుదారులు నిరసనకు దిగారు.

మరోవైపు, ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ఉదయనిధి స్టాలిన్ ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.

ఆయన పిటిషన్‌పై మధ్యాహ్నం అత్యవసర విచారణ జరగనుంది.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పోలీసుల అదుపులో డీఎంకే నేత

ADVERTISEMENT