Loading...
Madhya Pradesh: కుక్క వేషంలో కలెక్టరేట్‌కు వచ్చిన వ్యక్తి.. అధికారులకు షాక్.. అసలేం జరిగిందంటే?
అధికారులకు షాక్.. అసలేం జరిగిందంటే?

Madhya Pradesh: కుక్క వేషంలో కలెక్టరేట్‌కు వచ్చిన వ్యక్తి.. అధికారులకు షాక్.. అసలేం జరిగిందంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 19, 2026
12:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని ఎంచుకుంటుంటారు. కొందరు వినతిపత్రాలు సమర్పిస్తే.. మరికొందరు నిరసనలు, ఆందోళనల ద్వారా తమ సమస్యలను తెలియజేస్తారు. అయితే మధ్యప్రదేశ్‌లోని ఖండ్వాలో ఓ వ్యక్తి మాత్రం వినూత్నంగా నిరసన తెలిపి అందరి దృష్టిని ఆకర్షించాడు. వీధి కుక్కల సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఏకంగా కుక్క వేషధారణలో కలెక్టరేట్‌కు చేరుకున్నాడు. అక్కడ జరిగిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో పాల్గొన్నాడు. కుక్క దుస్తుల్లో వచ్చిన వ్యక్తిని చూసిన అధికారులు, అక్కడికి వచ్చిన ప్రజలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ వింత నిరసనను చూసేందుకు కలెక్టరేట్ ఆవరణలో జనం పెద్ద సంఖ్యలో గుమిగూడారు. కొందరు తమ ఫోన్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అవి వైరల్‌గా మారాయి.

వివరాలు 

అసలేం జరిగింది?

కుక్క వేషంలో ఉన్న వ్యక్తి తన నిరసనకు సంబంధించిన వివరాలను స్వయంగా వెల్లడించలేదు.

అయితే ఆయనతో పాటు వచ్చిన ఖండ్వా మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపక్ష నేత దీపక్ రాథోడ్ మాత్రం ఈ వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు.

ఖండ్వా నగరంలో వీధి కుక్కల సంఖ్య గణనీయంగా పెరిగిపోయిందని ఆయన అన్నారు.

దీంతో చిన్నారులు,కాలినడకన వెళ్లే ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కుక్కల నియంత్రణ కోసం మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన స్టెరిలైజేషన్ కార్యక్రమంలో భారీగా అవినీతి జరిగిందని దీపక్ రాథోడ్ ఆరోపించారు.

కుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేసినట్లు చూపిస్తూ అక్రమాలకు పాల్పడ్డారని ఆయన విమర్శించారు.

ఈవ్యవహారంలోని అవకతవకలను బయటపెట్టేందుకే తమ'డాగీ సోదరుడు'ఢిల్లీ నుంచి ఖండ్వాకు రావాల్సి వచ్చిందని చెప్పారు.

వివరాలు 

కుక్క వేషధారణలో వ్యక్తి.. భిన్నంగా స్పందిస్తున్న నెటిజన్లు

కుక్కల స్టెరిలైజేషన్ కార్యక్రమం కోసం ఖండ్వా మున్సిపల్ కార్పొరేషన్ రూ.40 లక్షల బిల్లు జారీ చేసిందని దీపక్ రాథోడ్ తెలిపారు.

ఈ బిల్లులో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఈ అంశంపై కలెక్టర్ నిర్వహించిన ప్రజా వినతుల కార్యక్రమంలో అధికారికంగా ఫిర్యాదు లేఖను సమర్పించారు.

మరోవైపు, కుక్క వేషధారణలో వ్యక్తి చేపట్టిన ఈ వినూత్న నిరసనపై సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వీధి కుక్కల సమస్యపై షాకింగ్ నిరసన

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మీడియాతో మాట్లాడుతున్న దీపక్ రాథోడ్

ADVERTISEMENT