Page Loader
DRDO Scientist Died : డీఆర్​డీఓ యువశాస్త్రవేత్త ఆత్మహత్య.. ఉద్యోగానికి రాజీనామా చేసి..
ఉద్యోగానికి రాజీనామా చేసి..

DRDO Scientist Died : డీఆర్​డీఓ యువశాస్త్రవేత్త ఆత్మహత్య.. ఉద్యోగానికి రాజీనామా చేసి..

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 15, 2023
06:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లోని డీఆర్​డీఓ (DRDO)లో ఉద్యోగం చేస్తున్న ఓ యువ సైంటిస్ట్‌ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉద్యోగానికి రాజీనామా చేసి ఆత్మహత్య చేసుకున్నారు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని పుత్తూరులో ఉన్న తన నివాసంలోనే బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే పోలీసులు శుక్రవారం వెల్లడించారు. పుత్తూరుకు చెందిన భరత్ (24)ఇటీవలే హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌లో జూనియర్‌ సైంటిస్ట్‌గా ఉద్యోగంలో చేరారు. ఇదే సమయంలో రెండు నెలల క్రితమే ఉద్యోగానికి రాజీనామా సైతం చేసేశారు. అనంతరం స్వగ్రామానికి వెళ్లి అక్కడ ప్రాణాలు తీసుకోవడం రక్షణ శాఖ డీఆర్'డీఓలో తీవ్ర ఆందోళన రేకెత్తించింది.

details

ఆత్మహత్య.. పరిష్కారం కాదు  

ఇదే ఏడాది ఫిబ్రవరిలోనూ మరో డీఆర్‌డీఓ సైంటిస్ట్‌ తనువు చాలించాడు. బి.రమేష్‌ (38) హైదరాబాద్‌లోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తీవ్ర అప్పులపాలై ఒత్తిడికు గురైన రమేష్‌ వాటిని తీర్చలేక సతమతమై ప్రాణాలు తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్య.. పరిష్కారం కాదు ఆత్మహత్య ఆలోచనలను కలిగిన వారు లేదా మీ స్నేహితులు, తెలిసిన వారు ఎవరైనా తీవ్ర ఒత్తిడిలో బలవన్మరణానికి పాల్పడాలని భావిస్తే స్నేహ ఫౌండేషన్'ను సంప్రదించాలని ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. ఈ మేరకు ఫోన్‌ నెంబర్‌ 04424640050 (24 గంటలు అందుబాటులో) సంప్రదించాలన్నారు. iCall టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ 9152987821 కాల్‌ చేసి కౌన్సెలింగ్‌ పొందవచ్చన్నారు.