Page Loader
చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు 
చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు

చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు 

వ్రాసిన వారు Stalin
Sep 27, 2023
04:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్కిల్ డెవలప్‌మెంట్ కేసును కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3వ తేదీకి వాయిదా పడింది. ఈ పిటిషన్ బుధవారం విచారణకోసం జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టి ధర్మాసనం ముందుకు వచ్చింది. అయితే జస్టిస్ భట్టి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు కావడంతో ఆయన విచారణ నుంచి తప్పుకున్నారు. దీంతో చంద్రబాబు నాయుడు తరఫు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా ఈ విషయాన్ని సీజేఐకి దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసును మరో బెంచ్‌కు బదిలీ చేయాలని సిద్ధార్థ్ లూథ్రా కోరారు. గురువారం నుంచి అక్టోబర్ 2 వరకు సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్నందున, ఈ కేసును అక్టోబర్ 3వ తేదీకి సీజేఐ వాయిదా వేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అక్టోబర్ 3న విచారణ