Loading...
Election Commission: 'సర్‌'పై ఈసీ కీలక నిర్ణయాలు.. అభ్యంతరాల గడువు పొడిగింపు!
'సర్‌'పై ఈసీ కీలక నిర్ణయాలు.. అభ్యంతరాల గడువు పొడిగింపు!

Election Commission: 'సర్‌'పై ఈసీ కీలక నిర్ణయాలు.. అభ్యంతరాల గడువు పొడిగింపు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 26, 2026
05:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

సర్‌ (SIR) ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించింది. ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాలు బయటపడిన తర్వాత తొలిసారి జరిగిన ఈ సమావేశానికి సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సందు, వివేక్‌ జోషి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎస్ఐఆర్‌ ప్రక్రియకు సంబంధించి పలు కీలక నిర్ణయాలను కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంది. ఎస్ఐఆర్‌ ప్రక్రియలో అభ్యంతరాల దాఖలు, పరిష్కారానికి సంబంధించి గడువులను పొడిగిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. నోటీసులు అందుకున్న ఓటర్లు తప్పనిసరిగా బూత్‌ లెవల్‌ ఆఫీసర్‌ (BLO)ను కలవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. బీఎల్‌వోలే ఓటర్ల ఇళ్లకు వచ్చి అవసరమైన పత్రాలను స్వీకరిస్తారని ఎన్నికల సంఘం తెలిపింది.

వివరాలు

బీఎల్వోలు ఇంటికి వస్తారు

ఎస్ఐఆర్‌లో నోటీసులు అందుకున్న వారికి బీఎల్‌వోలు ఇంటికి వచ్చి డాక్యుమెంట్లు తీసుకొని ఈసీఐనెట్‌లో అప్‌లోడ్‌ చేస్తారని ఈసీ పేర్కొంది.

ఇందుకోసం ఓటర్లు ఈఆర్వో కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఆన్‌లైన్‌ హియరింగ్‌ నిర్వహిస్తామని తెలిపింది.

అవసరమైతే ఓటరు తరఫున కుటుంబ సభ్యుడు కూడా హియరింగ్‌కు హాజరు కావచ్చని పేర్కొంది.

రాత్రి షెల్టర్లలో ఉండేవారు, కార్మికులు, పేదలు, నిరాశ్రయుల కోసం జిల్లా ఎన్నికల అధికారులు (DEOs) సహాయ కేంద్రాలు, ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని సీఈసీ ఆదేశించింది.

ఎస్ఐఆర్‌ ప్రక్రియలో అందరికీ అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

వివరాలు

నిబంధనల ప్రకారం ఫామ్ ను వినియోగించాలి

ఎస్ఐఆర్‌ ఫామ్‌-6 డిక్లరేషన్‌ను సుప్రీంకోర్టు సమర్థించిందని సీఈసీ పేర్కొంది. అయితే ఎస్ఐఆర్‌ కాకుండా ఇతర సమయాల్లో సాధారణ నిబంధనల ప్రకారం ఫామ్‌లను వినియోగించాలని స్పష్టం చేసింది.

ఈసీఐనెట్‌ వ్యవస్థను సీనియర్‌ డీఈసీ అధ్యక్షతన ఏర్పాటు చేసే కమిటీ సమీక్షిస్తుందని ఎన్నికల సంఘం తెలిపింది.

కొత్త ఐటీ మాడ్యూళ్లను ప్రవేశపెట్టే ముందు కమిటీ ఆఫ్‌ ఆఫీసర్స్‌ నుంచి ఆమోదం తీసుకోవాలని స్పష్టం చేసింది.

ఢిల్లీకి సంబంధించి క్లెయిమ్స్‌, అబ్జెక్షన్ల గడువును 30 అక్టోబర్‌ 2026 వరకు, వాటి డిస్పోజల్‌ గడువును 30 నవంబర్‌ 2026 వరకు పొడిగించినట్లు సీఈసీ వెల్లడించింది.

మహారాష్ట్రలో క్లెయిమ్స్‌ దాఖలుకు 12 అక్టోబర్‌ 2026 వరకు, వాటి డిస్పోజల్‌కు 10 నవంబర్‌ 2026 వరకు గడువు పొడిగిస్తున్నట్లు తెలిపింది.

ADVERTISEMENT

వివరాలు

కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్‌ ప్రక్రియ పూర్తి

ఇప్పటివరకు 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్‌ ప్రక్రియ పూర్తయిందని ఎన్నికల సంఘం పేర్కొంది.

ఓటర్లు, యువత కంటిన్యుయస్‌ అప్‌డేషన్‌ ప్రక్రియ ద్వారా తమ పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చుకోవచ్చని తెలిపింది.

ఇందుకోసం ప్రత్యేక ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహించాలని రాష్ట్రాల చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్లకు (CEOs) ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

ఇకపై కమిషన్‌ సమావేశాలకు ముందుగా అజెండాను, సమావేశం అనంతరం మినిట్స్‌ను జారీ చేయాలని సీఈసీ స్పష్టం చేసింది.

అధికారుల ఏపీఏఆర్‌లను ప్రతి ఏడాది డిసెంబర్‌ 31లోపు పూర్తి చేయాలని ఆదేశించింది. అలాగే అధికారుల విదేశీ పర్యటనలకు కమిషన్‌ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేసింది.

ADVERTISEMENT