ECI: అధికారుల బదిలీలపై రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు
లోక్‌సభ ఎన్నికల వేళ.. అధికారుల బదిలీలపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత జిల్లా నుంచి బదిలీ చేసే అధికారులను ఎన్నికలకు ముందు అదే పార్లమెంటరీ నియోజకవర్గంలోని మరో జిల్లాలో పోస్టింగ్ చేయకుండా చూడాలని ఈసీఐ పేర్కొంది. ముంబై మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ బదిలీ నేపథ్యంలో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈసీ ఈ ఆదేశాలను జారీ చేసింది. తమ బదిలీ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని ఈసీఐ పేర్కొంది. ఇటీవల చేసిన బదిలీలకు కూడా తాజా ఆదేశాలు వర్తిస్తాయని ఎన్నికల సంఘం చెప్పింది. సొంత జిల్లాలో పని చేస్తున్న వారిని, ఒకే చోట మూడేళ్లు పూర్తి చేసుకున్న అధికారులందరినీ బదిలీ చేయాలని ఈసీ ఆదేశించింది.