
Nithin : ''తమ్ముడు'' టైటిల్ వద్దన్నా.. కానీ దర్శకుడు నచ్చజెప్పాడు
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయనకు వీరాభిమానిగా నిలిచిన నటుల్లో నితిన్ మొదటి వరుసలో నిలుస్తారు. కెరీర్ ప్రారంభం నుంచే పవన్‌ను ఆదర్శంగా భావిస్తూ, తన సినిమాల్లో తరచూ ఆయనపై రిఫరెన్స్‌లు, ఎలివేషన్ సీన్లు పెట్టడం, పవన్ శైలిని అనుసరించడం నితిన్‌కు అలవాటే. అంతేకాదు, పవన్ కళ్యాణ్ సైతం నితిన్‌పై ప్రత్యేకమైన సానుభూతి చూపుతూ, అతని సినిమాలకు ప్రమోషనల్ మద్దతు ఇవ్వడమే కాదు, 'ఛల్ మోహన్ రంగ' చిత్రానికి సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. అయితే నితిన్ సినిమాల్లో తరచూ పవన్ కళ్యాణ్ పేరు చర్చకు రావడంతో.. కొందరు విమర్శలు చేస్తూ, సెటైర్లు వేస్తూ ఉండటంతో నితిన్ కొంత నొచ్చుకున్నట్లు తెలుస్తోంది.
Details
విజయం కోసం వేచియున్న నితిన్
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన దీనిపై స్పందించారు. ఈ సినిమాకు 'తమ్ముడు' అనే టైటిల్ పెట్టాలనుకున్నప్పుడు, మొదట నేను నిరాకరించాను. ఇప్పటికే పవన్ పై చాలా చేస్తున్నానని కొందరి విమర్శలున్నాయి. అలాంటి టైటిల్ వల్ల అప్రతిష్ఠకు గురికావాలనుకోలేదు. కానీ దర్శకుడు వేణు శ్రీరామ్, నిర్మాత దిల్ రాజు ఈ కథకు ఇది పర్ఫెక్ట్ టైటిల్ అని నన్ను నమ్మబలికారు. అందుకే చివరికి అంగీకరించానని నితిన్ వివరించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా వరుసగా ఫ్లాపులు ఎదురవుతున్న నితిన్‌కి ప్రస్తుతం ఈ సినిమా విజయం అత్యంత కీలకంగా మారింది.